టాలీవుడ్‌ టాప్‌10 హీరోయిన్లలో శాండల్‌వుడ్‌ భామలు ఎవరో తెలుసా!

Updated on Nov 14, 2022 06:18 PM IST
టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు
టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

టాలీవుడ్‌ (Tollywood) రేంజ్ పాన్‌ ఇండియా స్థాయికి పెరిగింది. నిన్న మొన్నటి వరకు ఒకటి లేదా రెండు భాషల్లోకి మాత్రమే తెలుగు సినిమాలను డబ్‌ చేసి విడుదల చేసేవారు. ఇప్పుడు దేశంలోని పలు భాషల్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అంతగా మన హీరోల స్టార్ డమ్ పెరిగింది. అదే కోవలోకి వచ్చి చేరుతోంది శాండల్‌వుడ్. ఇటీవల కన్నడ సినిమాలు సృష్టిస్తున్న రికార్డులు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

అంతేకాదు, వేరే భాషల సంగతి ఎలా ఉన్నా కన్నడ సినిమాలు టాలీవుడ్‌లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దానికి ఉదాహరణగా కేజీఎఫ్, కేజీఎఫ్‌2, కాంతార సినిమాలను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలు తెలుగులో విడుదలై కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

ఇక, కన్నడ సినిమాలతోపాటు శాండల్‌వుడ్ నుంచి వచ్చే హీరోయిన్ల సంఖ్య కూడా ఇటీవల మళ్లీ పెరిగింది. టాలీవుడ్‌నే కాదు భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్లుగా పేరుగాంచిన ఐశ్వర్యారాయ్, శిల్పా శెట్టి నుంచి అనుష్క శెట్టి, శ్రీలీల, ఆషికా రంగనాథ్‌ వరకు చాలామంది హీరోయిన్లు శాండల్‌వుడ్ నుంచి వచ్చినవాళ్లే.

కొన్నాళ్లుగా హీరోయిన్ అంటే ముంబై భామ అనే పేరు వచ్చినప్పటికీ.. టాలీవుడ్‌లో మరోసారి శాండల్‌వుడ్ భామల హవా పెరిగింది. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి వరుస అవకాశాలు అందుకుంటూ, కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్న టాప్‌10 కన్నడ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

సౌందర్య (Soundarya)

ఇప్పటికీ, ఎప్పటికీ మరచిపోలేని హీరోయిన్ సౌందర్య (Soundarya). 1993వ సంవత్సరంలో వచ్చిన ‘మనవరాలి పెళ్లి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. రాజేంద్రుడు.. గజేంద్రుడు సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. కర్నాటక బెంగళూరులో పుట్టిన ఈ హీరోయిన్‌ కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున (Nagarjuna), వెంకటేష్‌ (Venkatesh), బాలకృష్ణ (BalaKrishna) వంటి స్టార్ హీరోలందరితోనూ నటించారు.

సుమారు దశాబ్దంపాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన సౌందర్య.. అసలు పేరు కేఎస్‌ సౌమ్య. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఒక ప్రమాదంలో సౌందర్య మరణించారు.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

అనుష్క శెట్టి (Anushka Shetty)

అక్కినేని నాగార్జున (Nagarjuna) – పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా సూపర్. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అనుష్క శెట్టి. తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. కర్నాటక మంగళూరులో పుట్టిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి.

రవితేజ (RaviTeja)తో విక్రమార్కుడు, బలాదూర్, మహేష్‌బాబు (MaheshBabu) సరసన ఖలేజా, ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన బాహుబలి, మిర్చి, బిల్లా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది అనుష్క (Anushka Shetty). నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ చేస్తున్నారు.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

నయనతార (Nayanthara)

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన సూపర్‌‌హిట్‌ సినిమా ‘చంద్రముఖి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నయనతార. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్‌ షేర్ చేసుకుని లేడీ సూపర్‌‌స్టార్‌‌గా పేరు తెచ్చుకున్నారు నయన్.

కర్నాటక బెంగళూరులో పుట్టి పెరిగిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి కర్నాటకకు వెళ్లారు. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నయనతార (Nayanthara).

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

దీపికా పదుకొనె (Deepika Padukone)

2006వ సంవత్సరంలో కన్నడ సినిమా ‘ఐశ్వర్య’తో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ దీపికా పదుకొనె. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి పాగా వేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. హాలీవుడ్‌ సినిమాలో కూడా నటించిన దీపిక.. ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నారు.

వాస్తవానికి దీపికా పదుకొనె డెన్మార్క్‌లో పుట్టారు. ఆమెకు ఒక సంవత్సరం వచ్చేసరికి దీపిక తల్లిదండ్రులు కర్నాటకకు వచ్చేశారు. దాంతో ఆమె బాల్యం, చదువు మొత్తం బెంగళూరులోనే జరిగాయి. మొదటి సినిమా కూడా కన్నడ భాషలోనే చేశారు దీపిక (Deepika Padukone). ప్రభాస్ (Prabhas) నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. 

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

రష్మికా మందాన (Rashmika Mandanna)

ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్‌ రష్మికా మందాన. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇక, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా ఎదిగారు రష్మిక.

ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్న రష్మిక.. కర్నాటక కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో పుట్టారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు రష్మికా మందాన (Rashmika Mandanna)

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

పూజా హెగ్డే (Pooja Hegde)

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పూజా హెగ్డే హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తన అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో పూజా హెగ్డేకు అవకాశాలు క్యూ కట్టాయి.

వరుణ్‌ తేజ్‌ (Varun Tej)తో ముకుంద, అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ‘దువ్వాడ జగన్నాధం’, ‘అల వైకుంఠపురములో’, జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR)తో ‘అరవింద సమేత’, మహేష్‌బాబు సరసన ‘మహర్షి’, ప్రభాస్‌ (Prabhas)తో ‘రాధేశ్యామ్’ సినిమాల్లో నటించింది పూజా హెగ్డే.

పుట్టింది పెరిగింది మహారాష్ట్రలోని ముంబైలోనే అయినా.. పూజ తల్లిదండ్రులు కర్నాటకలోని ఉడుపికి చెందినవారు. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్‌బాబు (MaheshBabu)త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాలో నటిస్తోంది.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

కావ్య శెట్టి (Kavya Shetty)

‘నామ్ దునియా నామ్ స్టైల్‌’ సినిమాతో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ కావ్య శెట్టి. ఈ సినిమా 2013లో విడుదలై ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కన్నడంతోపాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన కావ్య..కర్నాటకలోని మంగళూరులో పుట్టారు.  

సత్యదేవ్ (Satyadev Kancharana), తమన్నా (Tamannaah) హీరోహీరోయిన్లుగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో హీరోయిన్‌గా చేశారు. సెప్టెంబర్‌‌ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే వివిధ కారణాలతో ఇప్పటికీ సినిమా విడుదల కాలేదు.. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో కావ్య శెట్టి (Kavya Shetty) ఒకరు.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

ఆషిక రంగనాథ్‌ (Ashika Ranganath)

2016లో విడుదైన ‘క్రేజీ బాయ్’ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ఆషిక రంగనాథ్. హీరోయిన్‌గా నటిస్తూనే పలు సినిమాల్లో ప్రత్యేక పాటల్లోనూ నర్తించింది. క్రేజీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆషిక.. కర్నాటకలోని హసన్ జిల్లాలో పుట్టారు.

ఇటీవలే బింబిసార సినిమాతో హిట్ అందుకున్న నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri KalyanRam) హీరోగా నటిస్తున్న ‘అమిగోస్’ సినిమాలో హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది ఆషిక రంగనాథ్‌ (Ashika Ranganath).

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

శ్రీలీల (Sreeleela)

పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన హీరోయిన్‌ శ్రీలీల. సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ (Roshan Meka) ఈ సినిమాలో హీరోగా నటించాడు. తన గ్లామర్‌‌తో యూత్‌ దృష్టిని ఆకర్షించిన శ్రీలీల.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. శ్రీలీల పుట్టింది యూఎస్‌లోని తెలుగు ఫ్యామిలీలోనే అయినా.. పెరిగింది మాత్రం కర్నాటకలోని బెంగళూరులో.

ఇక, రవితేజ (RaviTeja) హీరోగా తెరకెక్కుతున్న థమాకా సినిమాలో హీరోయిన్‌గా, బాలకృష్ణ (BalaKrishna) – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది ఈ కన్నడ భామ. వీటితోపాటు పలు తెలుగు సినిమాలు శ్రీలీల (Sreeleela) చేతిలో ఉన్నాయి.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

కృతి శెట్టి (Krithi Shetty)

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్న హీరోయిన్ కృతి శెట్టి. తన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించుకుంది. కృతి పుట్టింది మహారాష్ట్రలోని ముంబైలో అయినప్పటికీ వాళ్ల పూర్వికులు కర్నాటకలోని మంగళూరుకు చెందిన వారు.

నేచురల్‌ స్టార్‌‌ నాని (Nani) సరసన ‘శ్యామ్ సింగరాయ్‌’, నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ‘బంగార్రాజు’, నితిన్‌ (Nithiin) పక్కన ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌ (Ram Pothineni) సరసన ‘ది వారియర్’, సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటించింది. వీటిలో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. అయినా కృతి (Krithi Shetty)కి అవకాశాలు మాత్రం తగ్గడంలేదు.

టాలీవుడ్‌ (Tollywood)లో కన్నడ హీరోయిన్ల హవా మరోసారి ఎక్కువైంది. శాండల్‌వుడ్‌తోపాటు తెలుగు సినిమాలపైనా ఆసక్తి చూపుతున్నారు కన్నడ భామలు

సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కిన యూత్‌ ఫుల్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నేహా శెట్టి. కర్నాటకలోని మంగళూరులో పుట్టిన నేహా శెట్టి.. ‘ముంగారు మాలె2’  అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. డీజే టిల్లు సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌తో టాలీవుడ్‌లో పలు అవకాశాలను అందుకుంటున్నారు నేహా శెట్టి (Neha Shetty).

ఇక, మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్‌ క్రేజ్‌ అందుకున్న హీరోయిన్లలో శ్రీనిధి శెట్టి ఒకరు. యష్‌ (Yash) హీరోగా నటించిన కన్నడ సినిమా కేజీఎఫ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి.. మొదటి సినిమాతోనే విపరీతంగా పాపులర్‌‌ అయ్యారు.  

కేజీఎఫ్ సినిమాల తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తెలుగులో నటించే సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని టాక్. కర్నాటక మంగళూరులోని కిన్నిగోలిలో పుట్టారు శ్రీనిధి.

నభానటేష్, శ్రద్ధా శ్రీనాథ్‌ వంటి పలువురు హీరోయిన్లు కర్నాటకలో పుట్టినవారే. కొందరు హీరోయిన్లు వేరే వేరే రాష్ట్రాల్లో పుట్టినప్పటికీ వాళ్ల కుటుంబ మూలాలు మాత్రం కర్నాటకకు చెందినవే కావడం గమనించాల్సిన విషయం. టాలీవుడ్‌ (Tollywood)తోపాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ టాప్‌10 హీరోయిన్ల లిస్ట్‌లో చోటు దక్కించుకుని అభిమానులను అలరిస్తున్నారు శాండల్‌వుడ్‌ భామలు.

Read More : Tollywood Sequels : టాలీవుడ్‌లో సీక్వెల్స్‌గా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలో మరిన్ని మీకోసం రెడీ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!