Nayanthara: ఎన్టీఆర్ రిహార్సల్స్ చేయరు.. ఆయన డాన్స్ సూపర్.. తెలుగు హీరోలపై హీరోయిన్ నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on Dec 21, 2022 06:35 PM IST
తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారని నయనతార (Nayanthara) అన్నారు. ఇక్కడి హీరోలందరూ చాలా స్వీటెస్ట్ అని మెచ్చుకున్నారు
తెలుగు ప్రేక్షకులు తనపై ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారని నయనతార (Nayanthara) అన్నారు. ఇక్కడి హీరోలందరూ చాలా స్వీటెస్ట్ అని మెచ్చుకున్నారు

టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఒక్కో సినిమాకు రేంజ్ పెంచుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇందులో ఆయన నటన, డాన్సులు, ఫైట్లకు ఫారిన్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిపోయారు. కొమురం భీమ్ పాత్రలో ఆయన కనబర్చిన ఎమోషన్స్ అందర్నీ కట్టిపడేశాయి. తారక్ యాక్టింగ్‌ను సాధారణ ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు. అలాంటి ఆయనపై సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కూడా ప్రశంసల జల్లులు కురిపించారు. 

తారక్ డాన్స్ నెక్స్ట్ లెవల్ అంటూ నయనతార మెచ్చుకున్నారు. తాను నటించిన ‘కనెక్ట్’ (Connect) మూవీ ప్రమోషన్స్‌లో తెలుగు హీరోల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిహార్సల్స్ లేకుండా డాన్స్ చేస్తామని చాలా మంది హీరోలు చెప్పుకుంటారని.. కానీ ఒకట్రెండు సార్లయినా వాళ్లు ప్రాక్టీస్ చేస్తారని నయన్ అన్నారు. ‘ఎన్టీఆర్ మిగతా హీరోల్లా కాదు. ఆయన రిహార్సల్స్ చేద్దామా అని అడిగితే, తనకు అవసరం లేదని అంటారు. డాన్స్ మాస్టర్ చెప్పడమే ఆలస్యం.. టేక్‌కు వెళ్లిపోదామని అంటారు. ఒక్కోసారి మాస్టర్ చెప్పినదాని కంటే మెరుగ్గా చేయడం చూసి ఆశ్చర్యపోయేదాన్ని. నిజంగా ఆయన చాలా టాలెంటెడ్’ అని నయనతార చెప్పుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్, నయన్ కలసి ‘అదుర్స్’ సినిమాలో జంటగా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు

ఎన్టీఆర్‌తోపాటు మిగిలిన తెలుగు హీరోలతో కలసి పని చేయడం పైనా నయనతార ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పారు. వెంకటేశ్‌కు జంటగా చాలా సినిమాల్లో కనిపించానని.. ఆయనతో పని చేస్తుంటే ఓ నటుడితో ఉన్నట్లు అనిపించదన్నారు. వెంకీతో వర్క్ చేస్తుంటే ఒక ఫ్యామిలీలా ఉంటుందన్నారు. నాగార్జున స్వీట్ పర్సన్ అన్నారు. చిరంజీవి తన స్టార్‌డమ్‌ను అస్సలు చూపించరని నయన్ పేర్కొన్నారు. రవితేజతో కూడా ఎన్నో మూవీల్లో నటించానని.. తామిద్దరమూ మంచి ఫ్రెండ్స్ అన్నారు. ప్రభాస్ సెట్స్‌లో చిన్న పిల్లాడిలా సందడి చేస్తుంటారని.. కానీ ఆయన ఇప్పుడు బిగ్ స్టార్ అయ్యారన్నారు.

ఇక నయనతార మరో హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆమె నటించిన ‘కనెక్ట్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 22న ఏకకాలంలో విడుదల కానుంది. ఈ మూవీని నయన్ తన సొంత బ్యానర్ పై నిర్మించారు. సాధారణంగా మూవీ ప్రమోషన్స్‌లో ఆమె పాల్గొనరు. కానీ సొంత ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించిన చిత్రం కావడంతో ప్రచారం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. 

Read more: ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu) నుంచి క్రేజీ అప్డేట్.. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!