Unstoppable Season2: ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ తర్వాతి ఎపిసోడ్ కు గెస్టులుగా జయసుధ, జయప్రద, రాశీ ఖన్నా (Raashi Khanna)!

Updated on Dec 19, 2022 01:32 PM IST
నెక్స్ట్ ఎపిసోడ్ గెస్టులుగా సీనియర్ హీరోయిన్స్ జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) వస్తున్నారట. వీరిద్దరితో పాటుగా ప్రస్తుత హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) కూడా ఈ ఎపిసోడ్ లో రానుందట.
నెక్స్ట్ ఎపిసోడ్ గెస్టులుగా సీనియర్ హీరోయిన్స్ జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) వస్తున్నారట. వీరిద్దరితో పాటుగా ప్రస్తుత హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) కూడా ఈ ఎపిసోడ్ లో రానుందట.

Unstoppable Season2: టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ సీజన్2’ టాక్ షో చాలా సందడిగా సాగుతోంది. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో సీజన్ 2 ను ప్రారంభించారు. దీంతో సీజన్ 2 కూడా అదే రేంజ్ లో దూసుకువెళ్తోంది. ప్రతీ ఎపిసోడ్ నిజంగా అన్ స్టాపబుల్ అనిపిస్తోంది. 

ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మాచో మ్యాన్ గోపీచంద్ (Gopichand) ఈ టాక్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. దానికి సంబంధించిన ప్రోమో ఫుల్లుగా వైరల్ అయింది. ఇక, ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మెగా ఎపిసోడ్ డిసెంబర్ డిసెంబర్ 30న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నాడని అధికారికంగా ప్రకటన వచ్చింది.

అయితే, ప్రభాస్ కి సంబంధించిన ఎపిసోడ్ కారణంగా ఈ వార్తలు పెద్దగా వైరల్ కాలేదు. కానీ, బాలయ్య-పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఎపిసోడ్ డిసెంబర్ 27న షూటింగ్ జరగవచ్చని తెలుస్తోంది. ఈలోగా ఆహా ఓటీటీ మరో సర్ప్రైజ్ వచ్చింది. ఏకంగా మరో ముగ్గురు స్టార్లు షోలోకి రాబోతున్నారు. అందులో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కాగా.. ఒకరు లేటెస్ట్ గ్లామరస్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నారు.  

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటను ఆహా నుంచి కాసేపటి క్రితమే విడుదలయింది. దాని ప్రకారం.. నెక్స్ట్ ఎపిసోడ్ గెస్టులుగా సీనియర్ హీరోయిన్స్ జయసుధ (Jayasudha), జయప్రద (Jayaprada) వస్తున్నారట. వీరిద్దరితో పాటుగా ప్రస్తుత హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) కూడా ఈ ఎపిసోడ్ లో రానుందట. అయితే, అంతకుముందు వీరి గురించి క్లూ ఇస్తూ ‘ఆహా’ మూడు ఫోటోలను జత చేసి ఓ పోస్ట్ పెట్టింది. 

అందులో ఒక ఫోటోలో నట సింహంతో ‘సహజ నటి’ అని తెలియజేయగా.. మరొక ఫోటోలో అన్ స్టాపబుల్ లో ‘సాగర సంగమం’ అని వివరణ ఇచ్చారు. మూడవ ఫోటోలో ఏం సందేహం లేదు ఈమె మీ ‘ఊహలతో గుసగుసలాడుతుంద’ని మరొక హింట్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు వెంటనే కనిపెట్టేసి కామెంట్లు పెట్టేశారు. 

ఇదిలా ఉంటే.. జయసుధ, జయప్రద ఇద్దరికీ టాలీవుడ్ ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు అప్పటితరం హీరోలందరితో వీరు కలిసి నటించారు. దీంతో ఈ ఎపిసోడ్ లో ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకునేలా చేస్తున్నారట. ఇక రాశీ ఖన్నా తో కూడా బాలయ్య సరదాగా ఇంటర్వ్యూ ఉండబోతోంది. నాతో కలిసి నటిస్తావా అని రాశీ ఖన్నాని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అడిగే ఛాన్స్ ఉంది.

Read More: Unstoppable With NBK Season2: ప్రభాస్ (Prabhas), గోపీచంద్ (Gopichand), బాలయ్య.. అదరగొడుతున్న ‘అన్ స్టాపబుల్’ ప్రోమో!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!