'అమిగోస్' గా (Amigos) అలరించబోతున్న క‌ళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram).. 'NKR19' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Updated on Nov 07, 2022 12:48 PM IST
పోస్టర్‌ (NKR19 First Look Poster) చూస్తుంటే ఫస్ట్‌లుక్ తోనే సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది.
పోస్టర్‌ (NKR19 First Look Poster) చూస్తుంటే ఫస్ట్‌లుక్ తోనే సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల త‌రువాత 'బింబిసార' (Bimbisara) సినిమాతో కెరీర్‌లో పెద్ద స‌క్సెస్ అందుకున్నాడు నందమూరి క‌ళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు‌ కళ్యాణ్ రామ్. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 5న విడుదలై పాజిటీవ్ టాక్‌ తెచ్చుకుంది. రిలీజైన వారంలోపే బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వసూళ్లను సాధించింది.

ప్ర‌స్తుతం కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘NKR19’ (వర్కింగ్ టైటిల్) చిత్రం ఒక‌టి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. చాలా సైలెంట్ గా సినిమాను పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్ర టైటిల్ ను ప్రకటిస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను (NKR19 First Look Poster) విడుద‌ల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘అమిగోస్‌’ అనే టైటిల్ ను చిత్రబృందం ఫిక్స్‌ చేసింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో కళ్యాణ్‌ రామ్‌ మూడు విభిన్న గెటప్స్‌లలో కనిపిస్తున్నాడు. క్లాస్‌, మాస్‌తో పాటు పొడ‌వైన హెయిర్ స్టైల్‌తో మూడు గెట‌ప్‌లు విభిన్నంగా డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. 

పోస్టర్‌ (NKR19 First Look Poster) చూస్తుంటే ఫస్ట్‌లుక్ తోనే సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జిబ్రాన్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.

ఈ సినిమాలో బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. ‘ప‌టాస్’ త‌ర్వాత దాదాపు 8 ఏళ్ళ‌కు కళ్యాణ్‌ రామ్‌కు ఈ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ వచ్చింది. ఇక ఇప్పుడు అదే జోష్‌లో కళ్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తన తదుపరి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. 

Read More: కల్యాణ్​ రామ్ (Kalyanram Nandamuri) ‘బింబిసార’ (Bimbisara) సీక్వెల్ పై దర్శకుడు మల్లిడి వశిష్ట ఏమన్నారంటే..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!