మహేష్‌బాబు (MaheshBabu) లగ్జరీ లైఫ్‌ గురించిన ఆసక్తికర విశేషాలు (సూపర్‌‌స్టార్ దగ్గరున్న టాప్‌6 ఐటమ్స్)

Updated on Dec 14, 2022 06:26 PM IST
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu).. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల్లో ఒకరు. తన తండ్రి కృష్ణ నటించిన సినిమాల్లో చిన్నతనంలోనే నటించిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మురారి, ఒక్కడు సినిమాలతో స్టార్ హీరో హోదా దక్కించుకున్న ఆయన కెరీర్‌‌ను పోకిరి సినిమా మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత మహేష్‌ సినిమాలపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

అనంతరం, దూకుడు, బిజినెస్‌మాన్, శ్రీమంతుడు సినిమాలతో సూపర్‌‌స్టార్‌‌గా ఎదిగారు మహేష్‌. సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లు తీసుకుంటారని టాక్. అయితే సినిమాలతోపాటు యాడ్స్‌ చేస్తూ బాగానే సంపాదిస్తున్న మహేష్‌.. ఇటీవలే హోటల్ బిజినెస్‌ కూడా స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆయన తండ్రి కృష్ణ కూడా చాలాకాలంపాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగగా.. ఆయనకు స్టూడియో కూడా ఉంది. కృష్ణ ఇటీవలే మరణించారు. ఏది ఏమైనా.. మహేష్‌ దగ్గర ప్రస్తుతం కోట్ల రూపాయల బంగ్లాతోపాటు పలు విలువైన ఆస్తులు ఉన్నాయి. అవేంటి, వాటి విలువ ఎంత ఉంటుంది అనే ఆసక్తికర విషయాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం..

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

హైదరాబాద్‌లోని లగ్జరీ ఇల్లు :

హైదరాబాద్‌లో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు(MaheshBabu)కు అత్యంత ఖరీదైన బంగ్లా ఉంది. భార్య నమ్రతా శిరోద్కర్, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి అక్కడే నివాసం ఉంటారు మహేష్. ఆ లగ్జరీ ఇంటిలోనే స్విమ్మింగ్ పూల్, పార్టీలు చేసుకునేందుకు రూఫ్‌ టాప్‌ స్పేస్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న మహేష్‌ ఇంటి ప్రస్తుత విలువ రూ.35 కోట్లకు పైనే ఉంటుంది.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

ఏఎంబీ సినిమాస్‌ :

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మాదాపూర్ దగ్గర ఏఎంబీ మాల్‌ను నిర్మించారు. షాపింగ్ మాల్‌తోపాటు సినిమా థియేటర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆ మాల్‌లో ఏషియన్ కంపెనీతో కలిసి ఏఎంబీ సినిమాస్  (ఏషియన్‌ అండ్ మహేష్‌బాబు)  పేరుతో థియేటర్లను నిర్వహిస్తున్నారు. వీటి కోసం దాదాపు రూ.80 కోట్లు పెట్టుబడి పెట్టారు ప్రిన్స్ మహేష్‌బాబు (MaheshBabu).

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

వ్యానిటీ వ్యాన్‌ :

సినిమా షూటింగ్‌లకు వెళ్లడానికి వ్యానిటీ వ్యాన్‌ను కొనుగోలు చేశారు మహేష్‌బాబు. షూటింగ్ స్పాట్స్‌లో రెస్ట్ తీసుకునేందుకు దీనిని వినియోగిస్తూ ఉంటారు మహేష్ (MaheshBabu). దాదాపు స్టార్ హీరోలందరికీ ఇటువంటి క్యారే వ్యాన్లు ఉంటాయి. ఈ వ్యాన్‌లో ఆకర్షణీయమైన ఇంటీరియర్, బెడ్‌ రూమ్, వాష్‌ రూమ్, చిన్న లివింగ్ రూమ్‌ ఉంటాయి. మొత్తానికి ఈ వ్యానిటీ వ్యాన్‌ మినీ విల్లాను తలపిస్తుంది. దీని విలువ సుమారు రూ.6.2 కోట్లు ఉంటుందని అంచనా.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

లగ్జరీ కార్లు :

మహేష్‌బాబు కార్ల గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు కనిపిస్తాయి. సుమారు రూ.4 కోట్లకంటే ఎక్కువ ధర కలిగిన రేంజ్‌ రోవర్ ఆటోబయోగ్రఫీ కారుతోపాటు సుమారు అదే ధర ఉన్న రేంజ్‌ రోవర్‌‌ వోగ్, రూ.2.80 కోట్ల విలువైన లాంబోర్ఘిని గలార్డో కార్లను మహేష్‌బాబు (MaheshBabu) వినియోగిస్తారు.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు చాలా సింపుల్‌గా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువులు ఏంటో తెలుసుకుందాం

చేతి వాచీలు :

మహేష్‌బాబు (MaheshBabu) వద్ద ఖరీదైన వాచీలు కూడా ఉన్నాయి. వాటిలో రూ.50 లక్షల విలువైన పియాగెట్‌ పోలో వాచ్ ఒకటి. దీంతోపాటు రూ.45 లక్షల విలువైన బ్రెగ్వెట్‌ మెరైన్‌ క్రోనోగ్రాఫ్ వాచ్‌ కూడా ఉంది.

Read More : మొదటి సినిమా టైటిల్‌తో పాపులర్ అయిన టాలీవుడ్ టాప్‌10 సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!