రచయిత నుంచి దర్శకుడిగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20 ఏళ్ల సినీ ప్రయాణం!

Updated on Oct 13, 2022 01:07 PM IST
నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు
నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20 ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

సహాయ రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రచయితగా మారి.. డైరెక్టర్‌‌గా ఎదిగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). అభిమానులు ఆయనను ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారు. తెలుగు సినీ రచయితలకు, యువ దర్శకులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు త్రివిక్రమ్. ఆయన దర్శకత్వంలో నటించాలని స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు.

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేసిన త్రివిక్రమ్‌.. 1999వ సంవత్సరంలో తొట్టెంపూడి వేణు హీరోగా తెరకెక్కిన ‘స్వయంవరం’ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఈ సినిమాలోని మాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు కూడా మాటలు రాశారు.

2002లో తరుణ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మాతగా తెరకెక్కిన ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా మారారు త్రివిక్రమ్. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు త్రివిక్రమ్. అక్టోబర్‌‌ 10, 2002లో ‘నువ్వే నువ్వే’ సినిమా విడుదలైంది. ఈ సినిమా రిలీజై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)పై ప్రత్యేక కథనం..

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

‘నువ్వే.. నువ్వే’తో తొలి అడుగు

తరుణ్, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ‘నువ్వే నువ్వే’ సినిమాలో ప్రకాష్‌రాజ్ కీలకపాత్ర పోషించారు. సినిమా కమర్షియల్‌గా గ్రాండ్ సక్సెస్ కాలేదు. అయినప్పటికీ నిర్మాతలకు మాత్రం మంచి లాభాలనే సంపాదించిపెట్టింది. త్రివిక్రమ్‌ మాటలు, కథను నడిపించిన విధానం, ప్రకాష్‌రాజ్‌ నటన సినిమాకు హైలైట్.

సంగీత దర్శకుడు కోటి సమకూర్చిన బాణీలు నువ్వే నువ్వే సినిమాను మ్యూజికల్ హిట్‌గా నిలబెట్టాయి. స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాలతోపాటు నువ్వే నువ్వే సినిమాకు మాటల రచయితగా వరుసగా మూడుసార్లు ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు పొందారు త్రివిక్రమ్. నువ్వే నువ్వే సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌తో త్రివిక్రమ్‌కు మహేష్‌బాబుతో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కింది. మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా అతడు. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా భారీ హిట్‌ కాకపోయినా.. బుల్లితెరపైన మాత్రం సంచలన విజయం సాధించింది.

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

పవన్‌ కల్యాణ్‌తో జల్సా..

ఇక అతడు సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహించిన సినిమా జల్సా. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. జల్సా సినిమాలో పవన్‌ సరికొత్తగా కనిపించడమే కాకుండా ఆయన స్టైల్, యాటిట్యూడ్, కామెడీ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. ఈ సినిమాతో త్రివిక్రమ్‌ దర్శకత్వ ప్రతిభ కూడా మరింత మెరుగైందని సినీ విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. 

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

మహేష్‌బాబుతో ఖలేజా..

మహేష్‌బాబు (MaheshBabu)తో అతడు తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా ఖలేజా. ఈ సినిమా కూడా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. అయితే ఖలేజా సినిమాలో మహేష్‌ నటన, మేనరిజం, డైలాగులకు థియేటర్లు షేక్ అయ్యాయి. సినిమా బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. సంగీత ప్రియులకు అలరించింది. ఇక, ఖలేజా సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun)తో ‘జులాయి’ తెరకెక్కించారు. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి హిట్‌ ట్రాక్ ఎక్కేశారు త్రివిక్రమ్. 

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

రెండోసారి పవన్‌తో..

జల్సా సినిమా తర్వాత పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘అత్తారింటికి దారేదీ’ సినిమాను తెరకెక్కించారు త్రివిక్రమ్. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పవన్‌ కల్యాణ్‌కు జోడీగా సమంత నటించిన అత్తారింటికి దారేదీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా హిట్‌తో అల్లు అర్జున్‌ హీరోగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాను తెరకెక్కించారు త్రివిక్రమ్ (Trivikram Srinivas). డిఫరెంట్ కథాంశంతో తీసిన ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. అయినా బాక్సాఫీస్‌ వద్ద మాత్రం అనుకున్న స్థాయి సక్సెస్‌ను అందుకోలేదు. అయితే ఈ సినిమాలో పాటలు మాత్రం ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి.

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

నితిన్‌తో అ..ఆ..

యంగ్‌ హీరో నితిన్‌ (Nithiin)తో అ..ఆ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా తీశారు త్రివిక్రమ్. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రావు రమేష్‌ మేనరిజం, నితిన్, సమంతల డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. అనంతరం పవన్‌ కల్యాణ్‌తో మూడో సినిమాగా తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్‌‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ (Junior NTR) హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ అయ్యింది. అరవింద సమేత విజయం ఇచ్చిన జోష్‌తో అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమాను తెరకెక్కించి మరోసారి బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేశారు త్రివిక్రమ్.

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 20  ఏళ్లలో 11 సినిమాలు డైరెక్ట్‌ చేశారు

మహేష్‌బాబుతో నాలుగో సినిమా..

వరుసగా రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్‌బాబు (MaheshBabu)తో నాలుగో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని సమాచారం. మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తికాగా.. రెండో షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

డైరెక్టర్‌‌గా చేసిన నువ్వే నువ్వే సినిమా విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ 20 సంవత్సరాలలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం 11 మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మరెన్నో మంచి సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుదాం.

Read More : త్రివిక్రమ్ (Trivikram Srinivas)తో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తా: నాగవంశీ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!