Tollywood : చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఏం చదువుకున్నారో తెలుసా? టాప్‌10 టాలీవుడ్‌ స్టార్ హీరోల క్వాలిఫికేషన్స్‌

Updated on Dec 19, 2022 06:02 PM IST
టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.
టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

ఏ వృత్తిలో ఎదగాలన్నా కావాల్సింది టాలెంట్. చాలామంది చిన్నప్పటి నుంచే వారిలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి, వారికి ఉన్న వనరుల ప్రకారం ఆ వృత్తిలో ఎదగాలని ప్రణాళికలు వేసుకుంటారు. మరికొందరు తమకున్న ఆసక్తి ప్రకారం ఆయా వృత్తులను ఎంపిక చేసుకుంటారు.

ఏది ఏమైనా ప్రతి దానికీ బేసిక్ నాలెడ్జ్ అనేది ముఖ్యం. ఆ బేసిక్ నాలెడ్జ్ చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. తమ నటనా నైపుణ్యంతో కోట్ల మంది అభిమానులను అలరిస్తూ.. స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్‌ (Tollywood) హీరోలు ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకుందాం..

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) :

చిరంజీవి అంటే డాన్స్.. చిరంజీవి అంటే మాస్.. చిరంజీవి అంటే యాక్షన్.. చిరంజీవి అంటే వైవిద్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎటువంటి సహకారం, ఎవరి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్‌‌గా ఎదిగారు చిరంజీవి. ఎక్కడో మారుమూల ఉన్న పల్లెటూరిలో పుట్టి సినిమా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే సినిమా అనే స్థాయికి ఎదిగారు చిరు.

సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవి (Chiranjeevi).. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ (BalaKrishna) :

ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు బాలకృష్ణ. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన అఖండ సినిమా మొత్తం టాలీవుడ్‌కు ఊపునిచ్చిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్‌ కూడా రాబోతోందని ఇండస్ట్రీ టాక్. నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలయ్య.. తన స్టైల్, డైలాగ్ డిక్షన్‌తో 30 ఏళ్లకుపైగా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

సినిమాల్లో యాక్షన్ సీన్లతో అదరగొట్టే బాలకృష్ణ (BalaKrishna).. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

కింగ్ నాగార్జున (Nagarjuna) :

జానకి రాముడు, శివ, సంతోషం, మన్మధుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి వంటి విభిన్నమైన సినిమాలతో స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నాగార్జున. మాస్, క్లాస్, యాక్షన్, లవ్ రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ది ఘోస్ట్ సినిమాతో మన ముందుకు వచ్చారు. నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్‌ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.

తన స్టైల్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే నాగార్జున (Nagarjuna).. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

విక్టరీ వెంకటేష్ (Venkatesh) :

వరుస సినిమా విజయాలతో విక్టరీని ఇంటి పేరుగా చేసుకున్న హీరో వెంకటేష్. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తన నటనతో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించే వెంకీ.. మాస్, క్లాస్ సినిమాలు చేస్తూ 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరు ఉన్న వెంకటేష్‌.. ఇటీవల ఎఫ్‌3 సినిమాతో సూపర్‌‌ హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు వెంకీ. రానా దగ్గుబాటితో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించారు. అమెరికాలోని ది మాంటెరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు వెంకటేష్ (Venkatesh).

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) :

నటశేఖర కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి వచ్చిన మహేష్‌బాబు.. ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. మురారి, ఒక్కడు, పోకిరి, బిజినెస్‌మాన్, దూకుడు వంటి సూపర్‌‌హిట్ సినిమాలతో స్టార్ హీరో ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న మహేష్‌.. తర్వాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నట్టు వెల్లడించారు.

తన అందం, టాలెంట్‌తో యూత్‌ను ఆకర్షిస్తూ.. యువత గుండెల్లో చోటు దక్కించుకున్న మహేష్‌బాబు (MaheshBabu) కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) :

పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం.

ఇక, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌కు పరిచయమైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఇంటర్మీడియట్ రెండుసార్లు ఫెయిల్‌ అయినట్టు ఆయనే స్వయంగా తెలిపారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) :

బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌‌గా ఎదిగారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. బాహుబలి వంటి సూపర్‌‌హిట్ తర్వాత రాధేశ్యామ్, సాహో సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో సందడి చేయలేదు. అయినప్పటికీ, ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్‌ కె వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. సినిమాల్లోకి రాకముందే తన స్టడీస్‌ను పూర్తిచేశారు. ప్రభాస్‌ (Prabhas) బీటెక్ చదివారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) :

నిను చూడాలని సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు జూనియర్ ఎన్టీఆర్. బాలనటుడిగా పలు సినిమాలు చేసిన తారక్.. ఇటీవల వచ్చిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ దక్కించుకున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నట్టు ప్రకటన వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.

తన నటన, స్టైల్, డైలాగ్ డిక్షన్‌తో కోట్ల మంది అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) :

అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి వచ్చారు అల్లు అర్జున్. తన స్టైల్, హార్డ్‌వర్క్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రతి సినిమాలోనూ తన లుక్‌తోపాటు కథ కూడా డిఫరెంట్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమాకు సీక్వెల్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

తన స్టైల్‌తో యూత్‌ను అలరిస్తూ పలు అవార్డులను అందుకుంటున్న అల్లు అర్జున్ (Allu Arjun).. బ్యాచిలర్‌‌ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పూర్తి చేశారు.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు.

మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) :

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రాంచరణ్. తన టాలెంట్‌తో తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్‌ను దక్కించుకున్నారు. మగధీర సినిమాతో సూపర్‌‌హిట్ అందుకుని స్టార్‌‌గా ఎదిగారు చరణ్. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలో ఎన్టీఆర్‌‌తో చరణ్‌ చేసిన హంగామాకు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా కలెక్షన్ల వర్షం కురిసింది.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత శంకర్ దర్శకత్వంలోని సినిమాలో నటిస్తున్నారు రాంచరణ్ (RamCharan). హీరోగా నటిస్తూనే నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్న చరణ్‌.. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌ నుంచి డిగ్రీ పొందారు.

Read More : చిరంజీవి నుంచి సాయికుమార్ వరకు.. విలన్‌లుగా వచ్చి హీరోలుగా మారిన టాలీవుడ్‌ స్టార్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!