మహేష్ (Mahesh Babu)తో నేను గొడవపడేది ఆ ఒక్క విషయంలోనే!.. నమ్రత (Namrata Shirodkar) ఆసక్తికరమైన కామెంట్స్

Updated on Dec 17, 2022 02:12 PM IST
మహేష్ సినిమాల్లో ‘పోకిరి’ తనకు చాలా ఇష్టమని నమ్రత (Namrata Shirodkar) అన్నారు. అందులో ఆయన చెప్పే సంభాషణలు తనకెంతో నచ్చాయని చెప్పారు.
మహేష్ సినిమాల్లో ‘పోకిరి’ తనకు చాలా ఇష్టమని నమ్రత (Namrata Shirodkar) అన్నారు. అందులో ఆయన చెప్పే సంభాషణలు తనకెంతో నచ్చాయని చెప్పారు.

నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar).. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల కంటే కూడా సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్యగానే ఆమె ఎక్కువగా పాపులర్ అయ్యారు. మహేష్ (Mahesh Babu)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పారు. ఒకవైపు భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు మహేష్‌కు సంబంధించిన వ్యాపారలను కూడా మేనేజ్ చేస్తున్నారు నమ్రత. బిజినెస్ విమెన్‌గా రాణిస్తూనే.. భర్త మహేష్‌కు సంబంధించిన కాస్టూమ్స్ సహా ముఖ్యమైన విషయాలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. 

మాజీ మిస్ ఇండియా అయిన నమ్రత శిరోద్కర్.. ‘వంశీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ.. మహేష్–నమ్రతలను మాత్రం కలిపింది. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

మహేష్ (Mahesh Babu)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు నమ్రత గుడ్ బై చెప్పారు

సినిమాల్లోకి రాకముందు తాను మోడలింగ్‌ చేశానని నమ్రత అన్నారు. మోడలింగ్‌ బోర్‌ కొట్టడంతో మూవీ ఇండస్ట్రీ వైపు వచ్చానన్నారు. యాక్టర్‌గా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశానని తెలిపారు. ‘మహేశ్‌ నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలోనే అది ఎంతో సంతోషకరమైన రోజు. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి’ అని నమ్రత చెప్పారు.  

‘పెళ్లి అయ్యాక కూడా నాకు సినిమా చాన్సులు వచ్చాయి. కాకపోతే నటించాలనే ఉద్దేశం నాకస్సలు లేదు. మహేశ్‌కు నాకూ మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుంది. పిల్లలు తమకు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతుంటారు. ఆయన దేనికీ కాదనరు. నేను నో చెబుతుంటా. అలా మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి’ అని నమ్రత పేర్కొన్నారు. మహేష్ నటించిన సినిమాల్లో తనకు ‘పోకిరి’ అంటే ఎంతో ఇష్టమని నమ్రత అన్నారు. అందులో ఆయన చెప్పే పంచ్‌ డైలాగ్‌లు తనకెంతో నచ్చాయని పేర్కొన్నారు.

Read more: Macherla Niyojakavargam: థియేటర్లలో యావరేజ్.. ఓటీటీలో మాత్రం సూపర్ హిట్‌గా నిలిచిన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!