'కేజీఎఫ్ 3' (KGF 3) గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాకింగ్ స్టార్ యశ్ (Hero Yash) కీలక వ్యాఖ్యలు..!

Updated on Nov 06, 2022 10:34 AM IST
'కేజీఎఫ్ 3' (KGF 3) ఎప్పుడు వచ్చినా అందులో నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ హింట్ ఇచ్చారు కన్నడ రాకిండ్ స్టార్ యశ్.
'కేజీఎఫ్ 3' (KGF 3) ఎప్పుడు వచ్చినా అందులో నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ హింట్ ఇచ్చారు కన్నడ రాకిండ్ స్టార్ యశ్.

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) తెరకెక్కించిన 'కేజీఎఫ్ 2' (KGF 2) ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Hero Yash), శ్రీనిధి శెట్టి (Sreenidhi Shetty) జంటగా నటించిన ఈ సినిమా పలు రికార్డులను కొల్లగొట్టింది. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 చిత్రాలు పాన్ ఇండియా సినిమాలుగా ఇతర భాషల్లో కూడా విడుదలయి అన్నింటా అతి పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

కేజీఎఫ్ చాప్టర్ 1 (KGF Chapter 1)ని మించేలా మరింత భారీ సక్సెస్ అందుకున్న చాప్టర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో చాప్టర్ 3 కూడా ఉందనే చిన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel). దీంతో చాప్టర్ 3పై అప్పటి నుంచే ప్రేక్షకులలో మరింత ఆసక్తి ఏర్పడింది. 

ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 (KGF 3) ప్రాజెక్టుపై స్పందించారు హీరో యశ్ (Hero Yash).

మరోవైపు ఈ క్రేజీ కాంబో సినిమా త్వరలోనే రూపొందనుంది అనే వార్తలు కూడా ఇటీవల పలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో భాగంపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆ సినిమా హీరో యశ్ క్లారిటీ ఇచ్చారు. 'కేజీఎఫ్ 3' (KGF 3) ఎప్పుడు వచ్చినా అందులో నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ హింట్ ఇచ్చారు కన్నడ రాకిండ్ స్టార్ యశ్.

శనివారం ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 (KGF 3) ప్రాజెక్టుపై స్పందించారు హీరో యశ్ (Hero Yash). "కేజీఎఫ్ సిరీస్ లోని రెండు సినిమాలను ఆదరించారు. కేజీఎఫ్ 3 త్వరలోనే రాబోతోందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం కేజీఎఫ్ 3 గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.

ఇక, త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత 6,7 సంవత్సరాలుగా కేజీఎఫ్ చిత్రాలు చేస్తున్నాను. ఇక కేజీఎఫ్ 3  చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నాను. అలాగే పరిశ్రమలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. దీంతో 'కేజీఎఫ్' మూవీ లవర్స్ లో చాప్టర్ 3 పై ఒకింత నిరాశ ఏర్పడింది. అయితే యష్ (Hero Yash) మాటలను బట్టి పక్కాగా 'కేజీఎఫ్ చాప్టర్ 3' ఎప్పుడు తెరకెక్కుతుందనేది తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని మూవీ అనలిస్టులు అంటున్నారు.

Read More: RC15 Update: 'ఆర్సీ15' నుంచి అదిరిపోయే అప్‌డేట్.. దుబాయ్‌లో మెగా ఈవెంట్, ఒకే వేదికపై పవన్ కల్యాణ్, యష్ (Yash)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!