‘గీత గోవిందం’ కాంబో రిపీట్ ! విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో రష్మికా మందాన (Rashmika Mandanna) సినిమా
టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు రిపీట్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు కూడా. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మికా మందాన (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన గీత గోవిందం’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ, రష్మికా మందానను ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గర చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్, రష్మిక ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువకాలేదు. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమాకు మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా మాత్రం హిట్ సాధించలేదు.
అదే నిజమైతే మూడోసారి..
విజయ్ దేవరకొండ, రష్మికా మందాన, పరశురామ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. గీత గోవిందం టీం మరోసారి ప్రేక్షకులు అలరించడానికి రెడీ అవుతున్నారని టాక్. అదే నిజమైతే విజయ్, రష్మిక మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా తీయనున్నారు దర్శకుడు పరుశురామ్.
ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉన్నందున ఈలోపు విజయ్‌తో సినిమా తీసే ఆలోచనలో పరశురామ్ ఉన్నారని టాక్. ఇక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, రష్మికా మందాన (Rashmika Mandanna) పుష్ప2తోపాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
Read More : బాలీవుడ్ స్టార్ గోవిందాతో ‘సామి సామి’ పాటకు డాన్స్ చేసిన రష్మికా మందాన (Rashmika Mandanna).. వీడియో వైరల్