ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్!.. భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)?

Updated on Nov 12, 2022 03:34 PM IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ (Ram Pothineni)తో నటించబోయే మూవీ కోసం శ్రీలీల (Sreeleela) భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేశారని వినికిడి
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ (Ram Pothineni)తో నటించబోయే మూవీ కోసం శ్రీలీల (Sreeleela) భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేశారని వినికిడి

సినిమా రంగంలో పేరు, ప్రతిష్టలు సంపాదించుకోవడం అంత సులువు కాదు. దీనికి చాలా టైమ్ పడుతుంది. ఒక్క చిత్రంతో ఎవరూ స్టార్లు అయిపోరు. కొన్నేళ్ల శ్రమ, లక్ ఉంటేనే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవచ్చు. కానీ కొందరి విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని చెప్పొచ్చు. క్యూట్ బ్యూటీ శ్రీలీల ఈ కోవలోకే వస్తారు. తొలి సినిమాతోనే ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఆమె నటించిన ‘పెళ్లిసందD’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ శ్రీలీల (Sreeleela) మాత్రం వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. 

వెండితెరపై శ్రీలీల (Sreeleela) అందం, అభినయంతోపాటు డ్యాన్సులకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసే చాన్సులు కొట్టేశారు. ప్రస్తుతం మాస్ మహారాజా సరసన ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఈ మూవీతోపాటు రామ్ పోతినేని–బోయపాటి, బాలకృష్ణ–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్‌గా ఖరారైనట్లు సమాచారం. 

శ్రీలీల దూకుడు చూస్తుంటే టాప్ హీరోయిన్ లిస్టులోకి త్వరలో చేరిపోతారని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు

ఇకపోతే, వరుస ఆఫర్లు వస్తుండటంతో శ్రీలీల తన ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. తనకున్న డిమాండ్, క్రేజ్ దృష్ట్యా రెమ్యూనరేషన్‌ను పెంచేశారట. తొలి సినిమా ‘పెళ్లి సందD’కి కేవలం రూ.5 లక్షల పారితోషికం తీసుకున్న శ్రీలీల.. రవితేజ (Ravi Teja)తో నటిస్తున్న ‘ధమాకా’ (Dhamaka) చిత్రానికి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేశారట. తదుపరి రామ్ (Ram Pothineni) సరసన యాక్ట్ చేయబోయే మూవీకి రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని ఫిలిం దునియాలో వినికిడి. ఇంకా ఒక్క సూపర్ హిట్ పడకుండానే ఆమె ఈ రేంజ్‌లో పారితోషికం పెంచేయడంపై దర్శక–నిర్మాతలు షాకవుతున్నారట. శ్రీలీల దూకుడు చూస్తుంటే టాప్ హీరోయిన్ లిస్టులోకి త్వరలో చేరిపోతారని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. 

Read more: ‘బ్యాట్‌మన్‌’ (Batman) స్వరం ఇక వినిపించదు.. క్యాన్సర్‌తో కన్నుమూసిన కెవిన్ కాన్రాయ్ (Kevin Conroy)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!