"అట్లుంటది మనతోని.. టిల్లు ఈజ్‌ బ్యాక్".. డీజే టిల్లు (DJ Tillu Sequel) సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది..!

Updated on Oct 27, 2022 04:15 PM IST
“డీజే టిల్లు” (DJ Tillu) సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడంతో.. దీనికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు మూవీ మేకర్స్.
“డీజే టిల్లు” (DJ Tillu) సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడంతో.. దీనికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు మూవీ మేకర్స్.

DJ Tillu: 'డీజే టిల్లు'.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ (Siddhu Jonnalagadda) వెండితెర మీద డీజే టిల్లుగా చేసిన హంగామా అందర్నీ విపరీతంగా అలరించింది. తన డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్, తెలంగాణ యాస.. సినిమాని సక్సెస్ దిశగా తీసుకువెళ్లాయి. ఈ మూవీతో సిద్దు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

'డీజే టిల్లు' (DJ Tillu) సినిమాలోని  డైలాగ్స్, క్యాచీ పంచ్‏లు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్లలో 'అట్లుంటది మనతోని' అంటూ ఈ సినిమా డైలాగ్ ని వాడేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

“డీజే టిల్లు” (DJ Tillu) సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడంతో.. దీనికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు మూవీ మేకర్స్. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, తాజాగా దీపావళి కానుకగా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. 'టిల్లు స్క్వైర్' (Tillu Square) అనే టైటిల్ ను ఖరారు చేసి, పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ప్రోమోను కూడా విడుదల చేశారు. "మా స్టార్‌ బాయ్‌ సిద్దునూ కలవండి.. రెట్టింపు వినోదం, డబుల్ రొమాన్స్‌, డబుల్‌ మ్యాడ్ నెస్‌ తో టిల్లు ఈజ్‌ బ్యాక్" అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు మేకర్స్.

ఇక, ప్రోమోలో (DJ Tillu2 Promo) కానిస్టేబుల్ ఫిష్ వెంకట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ లో భాగంగా టిల్లుని ప్రశ్నించగా.. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు సీక్వెల్ పై అంచనాలను పెంచేలా ఉన్నాయి. “హీరోయిన్ గా చేయడానికి పూజ హెగ్దేకి ఖాళీ లేదంటా అన్న అని చెప్పగా.. బొచ్చు బిజీ ఉన్నవాళ్లు మనకి వద్దు, ఆమెకు చెప్పు డైరెక్టర్ యాక్షన్ చెప్పేలోపే మనం డైలాగ్ పూర్తీ చేసేస్తాం అట్లుంటది మనతోని” వంటి మాటలతో ఈసారి డబల్ ఫన్, డబల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందని తెలుస్తోంది. 

కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తోంది. అయితే 'డీజే టిల్లు' చిత్రానికి హీరోయిన్ మాత్రమే కాదు.. డైరెక్టర్ కూడా చేంజ్ అయ్యారు. మొదటి చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించనున్నారు. 

ఇక ఈ మూవీ సీక్వెల్ (DJ Tillu Sequel) ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో.. ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. డీజే టిల్లు చిత్రానికి మించి ఉంటుందని టాక్ నడుస్తోంది. కామెడీ థ్రిల్ల‌ర్ జోనర్‌లో రాబోతున్న సీక్వెల్‌లో అనుప‌మ‌, సిద్దు రొమాంటిక్ స‌న్నివేశాలు మూవీ లవర్స్‌ను ఫిదా చేసేలా ఉండబోతున్నాయని ఇన్‌ సైడ్‌ టాక్‌‌. కాగా, మార్చి 2023లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్.

Read More: DJ Tillu Sequel: 'డీజే టిల్లు' సీక్వెల్ కు దర్శకుడు మారాడు.. కొత్త డైరెక్టర్ మల్లిక్ రామ్ (Mallik Ram)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!