Dhamaka Trailer: మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా 'ధమాకా' ట్రైలర్.. ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన రవితేజ (Raviteja)!

Updated on Dec 16, 2022 12:17 PM IST
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ట్రైలర్ (Dhamaka Trailer) ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో రవితేజ తనదైన మాస్ యాక్షన్‌తో దుమ్మురేపారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ట్రైలర్ (Dhamaka Trailer) ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో రవితేజ తనదైన మాస్ యాక్షన్‌తో దుమ్మురేపారు.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ (Dhamaka). ఈ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. 

కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘ధమాకా’ (Dhamaka) చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా రవితేజ డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవితేజ ద్విపాత్రాభినయం అలరించబోతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా లాంచ్ చేశారు. 

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ట్రైలర్ (Dhamaka Trailer) ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో రవితేజ తనదైన మాస్ యాక్షన్‌తో దుమ్మురేపారు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో రవితేజ అదరగొట్టారు. 'కోట్లలో ఒకడాడు .. కొడితే కోలుకోలేరు' అనే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఈ సినిమాలో మాస్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఊహించుకోవచ్చు.

లవ్, యాక్షన్, మాస్ డాన్స్, పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ ను మిక్స్ చేసి ‘ధమాకా’ (Dhamaka Trailer) ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక, ట్రైలర్ చివర్లో 'నేను వెనకున్నవాళ్లను చూసుకుని ముందుకొచ్చినోనోణ్ణి కాదు.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అన్ని ఎగ్జామ్ పుల్ సెట్ చేసినవాడిని' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఇక, ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రలలో సచిన్ ఖేడ్కర్, జయరామ్, రావు రమేశ్ కనిపించనున్నారు.

Read More: రవితేజ (Raviteja) లేటేస్ట్ మూవీ ‘ధమాకా’ (Dhamaka) నుంచి “దండకడియాల్” (Danda kadiyal) ప్రోమో సాంగ్‌ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!