‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagatsingh) నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు హీరోయిన్ దొరికేనా?

Updated on Dec 15, 2022 05:36 PM IST
పూజా హెగ్డే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ 28’ (SSMB28) సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పూజా హెగ్డే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ 28’ (SSMB28) సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagatsingh) సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని తమిళ్ సూపర్ హిట్ ‘తెరీ’ మూవీ రీమేక్‏గా తెరకెక్కించనున్నా రంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా రీమేక్ వద్దంటూ నెట్టింట రచ్చ చేశారు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గతంలో ‘భవధీయుడు భగత్‌సింగ్‌’ పేరుతో అనౌన్స్‌ చేసినప్పుడు పూజా హెగ్డేను (Pooja Hegde) కథానాయికగా అనుకున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పూజా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. సినిమా పూజా కార్యక్రమంలోనూ బుట్టబొమ్మ ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. 

కాగా, పూజా హెగ్డే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ 28’ (SSMB28) సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ లో జరుగుతున్న జాప్యం కారణంగానే పూజా హెగ్డే.. పవన్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక, పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. కొద్ది రోజులుగా ‘హరి హర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మరోవైపు.. ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ (Director Sujeeth) దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే.. బాలీవుడ్‌లో రణ్ వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’, సల్మాన్‌ ఖాన్‌ సరసన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Read More: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటున్న పవన్ కళ్యాణ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagath Singh) టైటిల్ పోస్టర్ రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!