Godfather: ‘ఇంతకంటే ఏం చెప్పను’.. సత్యదేవ్ (Satya Dev) ఎమోషన్ పోస్ట్ వైరల్

Updated on Oct 13, 2022 12:14 PM IST
‘గాడ్‌ఫాదర్’ (GodFather) సక్సెస్‌పై ఎమోషనల్ పోస్టు పెట్టిన హీరో సత్యదేవ్ (Satya Dev) 
‘గాడ్‌ఫాదర్’ (GodFather) సక్సెస్‌పై ఎమోషనల్ పోస్టు పెట్టిన హీరో సత్యదేవ్ (Satya Dev) 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather) చిత్రం దసరా కానుకగా బుధవారం విడుదలైంది. టీజర్లు, ట్రైలర్లు, ప్రచార హోరుతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే సినిమా కూడా బాగుండటంతో తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. 

ఒరిజినల్ మూవీ ‘లూసిఫర్’కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’లో.. తెలుగు ఆడియెన్స్ కోరుకునే కమర్షియల్ హంగులు కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెన్సింగ్ రాబట్టింది. 

‘గాడ్‌ఫాదర్’లో చిరంజీవితోపాటు మిగిలిన నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రలో యాక్ట్ చేసిన యంగ్ హీరో సత్యదేవ్‌కు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. 

నెగటివ్ షేడ్స్ ఉన్న ‘జయదేవ్’ అనే పాత్రలో సత్యదేవ్ (Satya Dev) నటన బాగుందంటూ.. ముఖ్యంగా చిరును ఢీకొనే సీన్స్‌లో ఆయన డైలాగ్ డెలివరీ అదిరిపోయిందంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. త‌న‌కొచ్చిన అవ‌కాశాన్ని అన్ని ర‌కాలుగానూ స‌త్య‌దేవ్ ఉప‌యోగించుకున్నారని.. చిరుతో పోటాపోటీగా న‌టించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

ఆడియెన్స్‌తోపాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తుండటంతో సత్యదేవ్ స్పందించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఆయన ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంతోషంలో చిరంజీవి తన చేతిని ముద్దాడుతున్న స్టిల్‌ను సత్యదేవ్ షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు ’అంతే.. ఇంతకంటే ఏం చెప్ప‌గ‌ల‌ను’ అని క్యాప్షన్ జత చేశారు. ఈ పోస్టుకు మెగా ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ, కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే, మోహన్ రాజా తెరకెక్కించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో ప్రముఖ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించారు. హీరోయిన్ న‌య‌న‌తార‌తోపాటు సునీల్, బ్ర‌హ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ‘మ‌సూద్ భాయ్’ అనే పాత్ర‌లో న‌టించారు. గాడ్‌ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందించారు.

Read more: God Father: 'గాడ్ ఫాద‌ర్' సీక్వెల్‌కు రెడీ అంటున్న ద‌ర్శ‌కుడు మోహన్ రాజా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!