నేచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అన్ని కోట్లా!

Updated on Sep 14, 2022 06:39 PM IST
అంటే సుందరానికీ తర్వాత నేచురల్‌ స్టార్ నాని (Nani) చేస్తున్న సినిమా దసరా. ఆ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌  నెట్టింట వైరల్ అవుతోంది
అంటే సుందరానికీ తర్వాత నేచురల్‌ స్టార్ నాని (Nani) చేస్తున్న సినిమా దసరా. ఆ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది

విభిన్నమైన కథలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించాలని తపన పడుతుంటారు నేచురల్ స్టార్ నాని (Nani). సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ, మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నాని సినిమా విడుదలవుతోందంటే, అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు అనుకునే స్థాయికి ఎదిగారాయన.

ఇటీవలే 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు నాని. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈసారి మరో వైవిద్యమైన కథతో మన ముందుకు వస్తున్నారు నేచురల్ స్టార్. ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిన నాని 'దసరా' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మాస్ ప్రేక్షకులను అలరించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు నాని. అందుకే తన కెరీర్‌‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని మాస్ గెటప్‌లో కనిపిస్తున్నారు.

అంటే సుందరానికీ తర్వాత నేచురల్‌ స్టార్ నాని (Nani) చేస్తున్న సినిమా దసరా. ఆ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌  నెట్టింట వైరల్ అవుతోంది

రెమ్యునరేషన్‌ కూడా..

శ్రీకాంత్ ఓదెల ద‌ర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో దసరా సినిమా తెరకెక్కుతోంది. నాని కెరీర్‌‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాగా 'దసరా' నిలవనుంది. 'దసరా' సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకున్నారని టాక్. ఇదిలా ఉంటే 'దసరా' సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైర‌ల్‌ అవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా' చిత్రానికి భారీ స్థాయిలో థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.27 కోట్లకు 'ద‌స‌రా' సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయ‌ని సమాచారం. నాని కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్‌ అని టాక్. చ‌ద‌ల‌వాడ బ్రద‌ర్స్ స‌మ‌ర్పిస్తున్న 'దసరా' సినిమా నాన్-థియేట్రిక‌ల్ రైట్స్‌ దాదాపు రూ.45 కోట్ల వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 'దసరా' సినిమాలో నాని (Nani) సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్రథ‌మార్థంలో ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Read More : పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’తో పోటీ పడనున్న నాని(Nani) ‘దసరా’!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!