Tamannaah Bhatia Birthday : గ్లామర్ క్వీన్ తమన్నా భాటియా బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ..

Updated on Dec 21, 2022 03:37 PM IST
గ్లామర్ పాత్రలతో పాటు బలమైన పాత్రలలో నటించి మెప్పించిన తమన్నా(Tamannaah Bhatia).. స్పెషల్ పాటల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
గ్లామర్ పాత్రలతో పాటు బలమైన పాత్రలలో నటించి మెప్పించిన తమన్నా(Tamannaah Bhatia).. స్పెషల్ పాటల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

Tamannaah Bhatia Birthday : టాలీవుడ్ సినిమా రంగంలోనే కాకుండా సౌత్, నార్త్ ఇండియాలో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) . మొదటి సినిమా తమన్నాకు సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ వచ్చే వరకు తమన్నా తన పట్టుదలను వీడలేదు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. గ్లామర్ పాత్రలతో పాటు బలమైన పాత్రలలో నటించి మెప్పించిన తమన్నా.. స్పెషల్ పాటల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. మిల్క్ బ్యూటీ బర్త్ డే సందర్భంగా పింక్ విల్లా ప్రత్యేక కథనం..

తమన్నా భాటియా

తమన్నా భాటియాకు చిన్న నాటి నుంచి కళలపై ఆసక్తి ఉంది. నాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నారు. తమన్నా 13 ఏట నుంచే యాక్టింగ్ మొదలు పెట్టారు. నటిగా, మోడల్‌గా,  నృత్యకారిణిగా తమన్నా మంచి పేరు సంపాదించుకున్నారు.

తమన్నా భాటియా

2005లో విడుదలైన 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాతో తమన్నా భాటియా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమా ఫ్లాప్‌గా మిగిలింది.  నటిగా పేరు సంపాదించుకోవాలనే పట్టుదలను తమన్నా వీడలేదు.

తమన్నా భాటియా

2005లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా కూడా తమన్నాకు సక్సెస్ ఇవ్వలేక పోయింది. 2006లో 'కేడీ' తో తమిళ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తమన్నాకు మొదటి తమిళ సినిమా కూడా ఫ్లాప్‌గా మిగిలింది. 

తమన్నా భాటియా

తమన్నా (Tamannaah Bhatia) కు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ ఇచ్చాయి. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన 'హ్యాపీ డేస్' చిత్రం తమన్నాకు బ్లాక్ బాస్టర్ హిట్‌ ఇచ్చింది. తమిళ్ సినిమా 'కళ్ళూరి' కూడా భారీ సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో విడుదలైంది. 

తమన్నా భాటియా

2009లో ధనుష్ సరసన 'పడికతవాన్' సినిమాలో తమన్నా నటించింది. ఈ సినిమా తమన్నా కెరీయర్‌లో బిగ్ హిట్‌గా నిలిచింది.  

తమన్నా భాటియా

తెలుగులో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా కూడా తమన్నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో గీత సుబ్రమణ్యం పాత్రలో నటించిన తమన్నా ఉత్తమ నటిగా  ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక సూర్యతో నటించిన 'అయన్' సినిమా భారీ విజయాన్ని సాధించింది.

తమన్నా భాటియా

'అవారా', '100% లవ్', 'బద్రీనాథ్', 'ఆగడు', 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాల్లో కథానాయికగా నటించి మరింత పాపులర్ అయ్యారు. సినిమా హిట్టా.. ఫట్టా అనే విషయాలతో సంబంధం లేకుండా తమన్నాకు వరుస ఆఫర్లు అందుకున్నారు. 

తమన్నా భాటియా

2015లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన 'బాహుబలి' తమన్నా కెరీయర్‌ను మలుపు తిప్పింది. అప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించిన తమన్నా బాహుబలిలో కీలక పాత్రలో నటించారు. 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలతో తమన్నా టాప్ హీరోోయిన్‌గా మారారు. 

తమన్నా భాటియా

మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా స్పెషల్ పాటల్లో కూడా నటించి మెప్పించారు. 'కేజీఎఫ్ చాప్టర్ 1' సినిమాలో యశ్‌తో కలిసి తమన్నా వేసిన స్టెప్పులు థియేటర్లను షేక్ చేశాయి. 

తమన్నా భాటియా

'ఎఫ్2' చిత్రంలో తమన్నా నటన అందరినీ ఆకట్టుకుంది. కామెడీ పండించడంలో కూడా తమన్నా బెస్ట్ అనిపించుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా' చిత్రంలో ప్రత్యేక పాత్రలో తమన్నా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 'ఆనందో బ్రహ్మా', 'యాక్షన్', 'పెట్రో మాక్స్' చిత్రాలలో తమన్నా కొత్త పాత్రలలో నటించారు.

 

తమన్నా భాటియా

2020లో మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో స్పెషల్ పాటలో తమన్నా నటించి అలరించారు. ఈ సినిమాలో తమన్నా మహేష్ బాబుతో కలిసి చేసిన డాన్సులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

2022లో తమన్నా నటించిన 'ఎఫ్3', 'గని', 'గుర్తుందా శీతాకాలం' చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుత తమన్నా మెగాస్టార్ చిరంజీవి సినిమా 'భోళా శంకర్‌'లో నటిస్తుంది.  మలయాళ, హిందీ సినిమాల్లోనూ తమన్నా నటించనున్నారు. 

Read More: Fittest Tollywood Actresses : ఫిట్ నెస్ విషయంలో హీరోలతో పోటీ పడుతున్న టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్లు

 

తమన్నా భాటియా

 
 
నటిగా కెరీయర్ ఎంచుకున్న తమన్నా.. కెరీయర్ మొదట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. తన హార్డ్ వర్క్‌తో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. తమన్నా భవిష్యత్తులో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే తమన్నా భాటియా.
పింక్ విల్లా.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!