Veera Simha Reddy: సుగుణ సుందరి అంటున్న ‘వీరసింహారెడ్డి’.. బాలయ్య–శ్రుతి డ్యాన్స్ మూవ్స్ మామూలుగా లేవుగా..!

Updated on Dec 15, 2022 12:58 PM IST
‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్య–శ్రుతి హాసన్ మీద షూట్ చేసిన ‘సుగుణ సుందరి’ (Suguna Sundari) సాంగ్ హుషారుగా సాగుతూ ఆడియెన్స్‌ను అలరిస్తోంది
‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్య–శ్రుతి హాసన్ మీద షూట్ చేసిన ‘సుగుణ సుందరి’ (Suguna Sundari) సాంగ్ హుషారుగా సాగుతూ ఆడియెన్స్‌ను అలరిస్తోంది

టాలీవుడ్ హీరోల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) అందరికంటే ప్రత్యేకమనే చెప్పాలి. పవర్‌ఫుల్ ఫైట్స్, పంచ్ డైలాగులతో మాస్ సినిమాల స్థాయిని ఆయన పెంచారు. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్నకేశవరెడ్డి’ లాంటి చిత్రాలు మాస్ హీరోయిజం ఎలా ఉంటుందో సరికొత్త నిర్వచనం చెప్పాయి. ఈ చిత్రాలతో రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఆ జోనర్లో ఆయన చేసిన పైచిత్రాలన్నీ సంచలన విజయాలను నమోదు చేశాయి. అలాంటి నేపథ్యంతోనే తెరకెక్కుతున్న మరో సినిమా ‘వీరసింహారెడ్డి’

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘జై బాలయ్య’ పాట విడుదలై.. మంచి ఆదరణ దక్కించుకుంది. తాజాగా ‘సుగుణ సుందరి.. సుర సుర సూపుల రాకుమారి’ అనే లిరికల్ సాంగ్ రిలీజైంది. ‘సీమా కుట్టిందే.. సిట్టి సీమా కుట్టిందే.. దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే’ అంటూ బాలయ్య–శ్రుతి మీద షూట్ చేసిన ఈ సాంగ్ మస్త్ హుషారుగా సాగుతూ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 

‘సుగుణ సుందరి’ (Suguna Sundari) సాంగ్‌కు ఎస్ఎస్ తమన్ బాణీ కట్టగా.. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. రామ్ మిరియాల, స్నిగ్ధ శర్మ పాడిన ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్‌లో బాలయ్య–శ్రుతి మధ్య కెమిస్ట్రీతోపాటు వారిద్దరూ వేసిన కొన్ని స్టెప్స్ సూపర్బ్ అనేలా ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. బాలకృష్ణ హెయిర్ స్టయిల్‌ కూడా బాగుందంటున్నారు. మరి, సాంగ్స్‌తోనే ఓ రేంజ్‌లో బజ్ తెచ్చుకుంటున్న బాలయ్య మూవీ పొంగల్‌కు ఎంత హంగామా చేస్తుందో చూడాలి. 

ఇకపోతే, ‘వీరసింహారెడ్డి’తో పాటు చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, తమిళ హీరోలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ సినిమాలు కూడా సంక్రాంతి రేసులోకి దిగడం ఖాయమైంది. దీంతో థియేటర్ల సమస్య తప్పేలా లేదు. ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బరిలో ఉన్నవన్నీ పెద్ద చిత్రాలే కావడంతో ఓపెనింగ్స్ ఎలా ఉన్నప్పటికీ.. లాంగ్ రన్ ఉంటేనే లాభాలు రాబట్టడం సులువవుతుందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. మరి, పండక్కి ప్రేక్షకుల మనసుల్ని ఏయే సినిమాలు గెలుస్తాయో చూడాలి.  

Read more: మహేష్‌ బాబు (MaheshBabu) లగ్జరీ లైఫ్‌ గురించిన ఆసక్తికర విశేషాలు (సూపర్‌‌స్టార్ దగ్గరున్న టాప్‌-6 ఐటమ్స్)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!