సంక్రాంతి బరిలో చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (BalaKrishna).. ఒక్కరోజు తేడాతో విడుదల కానున్న సినిమాలు!

Updated on Oct 31, 2022 09:36 PM IST
మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నటసింహం నందమూరి బాలకృష్ణ (BalaKrishna).. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు. వీరిద్దరి సినిమాలు చాలాసార్లు సంక్రాంతి బరిలో నిలిచాయి. సినిమా ఎప్పుడు విడుదలైనా.. ఎటువంటి జానర్‌‌లో తెరకెక్కినది అయినా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే తమ టార్గెట్‌ అని ఎన్నోసార్లు చెప్పారు ఈ స్టార్ హీరోలు.

రెండు నెలల్లో సంక్రాంతి రానుంది. ఈ పండుగకు బరిలో నిలిచే సినిమాలపై ఇప్పటికే చర్చ మొదలైంది. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. చిరంజీవి కూడా ఈసారి సంక్రాంతి బరిలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని టాక్. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగకు చిరంజీవి – బాలకృష్ణ పోటీ పడనున్నారని సమాచారం.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా టైటిల్ ఇటీవలే అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు టైటిల్‌తోపాటు సంక్రాంతి పండుగకు సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతి బరిలో నిలబెట్టనున్నట్టు టైటిల్‌ పోస్టర్‌‌ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ‘వీరసింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి

రెండు సినిమాలనూ నిర్మించేది మైత్రీ మూవీ మేకర్స్‌ కావడంతో..

చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. దీంతో ఈ రెండింటిలో ఒక సినిమా విడుదలను వాయిదా వేసే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకునేందుకు ఇద్దరు హీరోలు సుముఖంగా లేకపోవడంతో రెండు సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 11వ తేదీన, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు టాక్. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలతో చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (BalaKrishna) అభిమానులకు ముందుగా పండుగ రానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ రెండు సినిమాలతోపాటు ప్రభాస్ ఆదిపురుష్ కూడా రిలీజ్ కావాల్సిఉండగా..  ఆ సినిమా అది వాయిదా పడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అఖిల్ ఏజెంట్ సినిమాతో, దళపతి విజయ్ వారసుడు సినిమాతో  సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయి.

Read More : ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ సాంగ్‌తో అలరించనున్న చిరంజీవి (Chiranjeevi), రవితేజ (RaviTeja).. ఫ్యాన్స్‌కు జాతరే ఇక

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!