‘వాల్తేరు వీరయ్య’లో మాస్ సాంగ్‌తో అలరించనున్న చిరంజీవి (Chiranjeevi), రవితేజ (RaviTeja).. ఫ్యాన్స్‌కు జాతరే ఇక

Updated on Oct 30, 2022 07:31 PM IST
గాడ్‌ఫాదర్‌‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది
గాడ్‌ఫాదర్‌‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌‌టైనర్‌‌లో మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) కీలకపాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి, రవితేజను ఒకే స్క్రీన్‌పై చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాడ్‌ఫాదర్ వంటి హిట్‌ తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

చాలాకాలం తర్వాత చిరంజీవి పూర్తి స్థాయి మాస్ సినిమాలో నటిస్తుండడం, మాస్‌ గెటప్‌లో అలరించనుండడంతో వాల్తేరు వీరయ్య సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక, దీపావళి కానుకగా టైటిల్‌ రిలీజ్ టీజర్‌‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టైటిల్‌ రిలీజ్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీంట్లో చిరంజీవి మాస్ లుక్, డైలాగ్స్, గ్రేస్‌కు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

గాడ్‌ఫాదర్‌‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్‌ టీజర్‌‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది

ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..!

వాల్తేరు వీరయ్య సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కొత్త షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్‌ను తెరకెక్కించారని సమాచారం. ఈ పాటలో చిరు, రవితేజ మాస్ స్టెప్స్‌కు అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని టాక్. చిరంజీవి, రవితేజలపై మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగతం అందిస్తున్నారు. ఆయన అందించిన మాస్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారని, థియేటర్లలో ఈ పాటకు ఫ్యాన్స్‌ ఖుషీ కావడం ఖాయమని చెబుతున్నారు. 

చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపించిన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్‌‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌‌పై రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దసరా పండుగకు గాడ్‌ఫాదర్‌‌ సినిమాతో, దీపావళికి టైటిల్‌ టీజర్‌‌తో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్‌‌ చిరంజీవి (Chiranjeevi).. సంక్రాంతి పండుగకు మాస్‌మహారాజా రవితేజ (RaviTeja)తో కలిసి అభిమానులకు ఎలాంటి మాస్ ఫీస్ట్ ఇస్తారో వేచి చూడాలి.

Read More : యూట్యూబ్‌లో చిరంజీవి (Chiranjeevi) దివాళీ థమాకా! 3 రోజులు.. 10 మిలియన్ వ్యూస్‌తో ‘వాల్తేరు వీరయ్య’ రికార్డు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!