పూజా హెగ్డే (Pooja Hegde)కు సర్‌‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్‌ఖాన్ (Salman Khan).. ఫిదా అయిన బుట్ట బొమ్మ

Updated on Oct 17, 2022 02:12 PM IST
బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు
బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే (Pooja Hegde). తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్నారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. అక్టోబర్‌‌ 10వ తేదీన పుట్టినరోజు జరుపుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా హెగ్డే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో నటిస్తున్నారు.

‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డేకు చెల్లెలి పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే పుట్టినరోజు వేడుకలను ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ షూటింగ్‌ సెట్‌లోనే నిర్వహించారు సల్మాన్, వెంకీ. కేక్ కట్ చేయించి పూజాకు బర్త్‌డే విషెస్ చెప్పారు.

వైరల్ అవుతున్న ఫోటోలు..

కాగా, ఈ బర్త్‌డే వేడుకల గురించిన మరో ఆసక్తికర వార్త నెట్‌లో వైరల్ అవుతోంది. షూటింగ్‌ సెట్‌లో కేక్‌ కట్‌ చేయించి సర్‌‌ప్రైజ్ చేసిన సల్మాన్‌ఖాన్ (Salman Khan).. పూజకు మరో సర్‌‌ప్రైజ్‌ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. పూజా హెగ్డేకు ఖరీదైన డైమండ్ బ్రాస్లెట్‌ ఇచ్చినట్టు సమాచారం. నా లైఫ్ లో ఇది మెమొరబుల్ డే అని చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, ప్రస్తుతం పూజా.. తెలుగులో మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిట్‌ను ఫిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ మూడో వారంలో మొదలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌ – పూజా హెగ్డే (Pooja Hegde) మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

Read More : పవన్ (Pawan Kalyan) సరసన పూజా హెగ్డే (Pooja Hegde) ఫిక్స్!.. ఆసక్తిని రేకెత్తిస్తున్న హరీష్ శంకర్ ట్వీట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!