పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా సుధీర్ బాబు (Sudheer Babu) 18వ సినిమా.. వినూత్నంగా పోస్టర్..!

Updated on Oct 27, 2022 04:20 PM IST
సుధీర్ బాబు (Sudheer Babu) ఎప్పుడూ చూడని మాస్ పాత్రలో  కనిపించనున్నాడని తెలిపింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఓ ఫొటోను రిలీజ్ చేసింది.
సుధీర్ బాబు (Sudheer Babu) ఎప్పుడూ చూడని మాస్ పాత్రలో  కనిపించనున్నాడని తెలిపింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఓ ఫొటోను రిలీజ్ చేసింది.

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు (Sudheer Babu) వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకె వెళుతున్నాడు. ఇటీవలే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ టాక్‌ మూటగట్టుకుంది. దీంతో తర్వాతి చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. 

ఈ నేపథ్యంలోనే వరుసగా డిఫరెంట్‌ జోనర్లలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు సుధీర్ బాబు (Sudheer Babu). ఆయన హీరోగా న‌టిస్తున్న 18వ సినిమాను తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి 'సెహ‌రి' ఫేమ్ జ్ఞాన సాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 1989 లో కుప్పం బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ అంశాల‌కు భ‌క్తిని మేళ‌వించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో సుధీర్ బాబు (Sudheer Babu) ఎప్పుడూ చూడని మాస్ పాత్రలో  కనిపించనున్నాడని తెలిపింది చిత్ర యూనిట్. ఈ మేరకు ఓ ఫొటోను రిలీజ్ చేసింది. ఆ ఫొటోలో పోస్టు కార్డుపై ఓ దేవాలయం ఉంది. సుబ్రమణ్యం, s/o శివారెడ్డి, పాలస్ రోడ్, కుప్పం, చిత్తూరు జిల్లా చిరునామ రాసి ఉంది. పోస్టు కార్డుపై ఓ టెంపుల్ బొమ్మ‌తో పాటు గ‌న్‌, బుల్లెట్స్‌, పాత వంద రూపాయ‌ల నోటు కనిపిస్తున్నాయి. ‘మీరు తప్పకుండా రావాలి..’ అనే సందేశం కూడా ఉంది.

దీనికి సంబంధించి సుధీర్ బాబు (Sudheer Babu) కూడా ఓ ట్వీట్ చేశాడు. ‘పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా!’ అని ట్వీట్ లో తెలిపారు. దీనిని బట్టి రాయలసీమ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అక్టోబ‌ర్ 31న ఈ చిత్రానికి సంబంధించిన మాస్ అప్‌డేట్‌ని రివీల్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సుధీర్‌ బాబు (Sudheer Babu) గతంలో ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌సీ (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌ పై సుమంత్ జి నాయుడు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

Read More: 'హంట్' టీజర్ (Hunt Teaser) మామూలుగా లేదుగా.. అదిరిపోయిన సుధీర్ బాబు (Sudheer Babu) యాక్షన్ సీన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!