Unstoppable With NBK Season2: 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే' తర్వాతి ఎపిసోడ్ లో పవర్ స్టార్.. ఈ వార్తలో నిజమెంత?

Updated on Dec 16, 2022 03:45 PM IST
తర్వాతి ఎపిసోడ్ కు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం ఫిలింనగర్‌ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. తర్వాతి ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెస్టుగా హాజరు కాబోతున్నారట.
తర్వాతి ఎపిసోడ్ కు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం ఫిలింనగర్‌ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. తర్వాతి ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెస్టుగా హాజరు కాబోతున్నారట.

తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే సీజ‌న్ 2 (Unstoppable With NBK Season2) టాక్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌ మెంట్ అందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. టాలీవుడ్ సీనయర్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.    

‘అన్‌స్టాప‌బుల్’ మొదటి సీజన్‌లో ఓటీటీ రేటింగులు బద్ధలు కొట్టింది. దీంతో సీజన్ 2 కూడా ఇటీవలే ప్రారంభించారు. ఇప్పటికే సీజన్ 2 నుండి వచ్చిన ఎపిసోడ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ తో ప్రారంభమైన ఈ షోలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

వీరితోపాటు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్‌ సేన్‌ (Vishwak sen), సిద్దు జొన్నగడ్డ, శర్వానంద్, అడివి శేష్ (Adivi Sesh) హాజరై సందడి చేశారు. ఇక, టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌బాబు, దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వంటి దిగ్గజాలు సైతం హాజరై ప్రేక్షకులను అలరించారు. 

ఈ వారం రిలీజ్ కానున్న ఆరో ఎపిసోడ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas) గెస్ట్‌గా హాజ‌రుకానున్నాడు. ఇటీవల ఈ ఎపిసోడ్ కు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ (Special Glimpse) రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ఇక, వీడియోలో ‘బాహుబ‌లి’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాయిస్ వినిపించ‌గానే యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ స్టైలిష్‌గా స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. 

ఇదిలా ఉంటే.. తర్వాతి ఎపిసోడ్ కు సంబంధించిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం ఫిలింనగర్‌ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. తర్వాతి ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెస్టుగా హాజరు కాబోతున్నారట. ఇదే గనుక నిజమైతే.. నందమూరి, మెగా అభిమానులకు పండగ లాంటి విషయమే. మరోవైపు పవన్‌ కల్యాణ్‌తో డైరెక్టర్లు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, క్రిష్‌ జాగర్లమూడా స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారట. ఎపిసోడ్‌ ముగింపులో వీరి ఎంట్రీ ఉండనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read More: UnstoppablewithNBK2: ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే’లో ప్రభాస్ (Prabhas) స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. త్వరలో ప్రోమో విడుదల?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!