టాప్–10 అందగత్తెల్లో ఒకరిగా దీపికా పదుకొణె (Deepika Padukone).. భారత్ నుంచి ఈ స్టార్ హీరోయిన్‌కు మాత్రమే చోటు

Updated on Oct 17, 2022 06:22 PM IST
ప్రపంచంలోని టాప్–10 అందగత్తెల లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చోటు దక్కించుకున్నారు.
ప్రపంచంలోని టాప్–10 అందగత్తెల లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) చోటు దక్కించుకున్నారు.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) అరుదైన ఫీట్‌ను నమోదు చేశారు. ప్రపంచ టాప్–10 అందగత్తెల్లో ఒకరిగా ఆమె చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌లోని టాప్–10 అందగత్తెల్లో తొమ్మిదో స్థానంలో దీపిక నిలిచారు. ఈసారి భారత్ నుంచి ఈ లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ దీపికనే కావడం గమనార్హం. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌ను జోడీ కామర్ దక్కించుకున్నారు. 

టాప్–10 అందగత్తెల లిస్టు (Most Beautiful Women List)ను బ్రిటన్‌కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డీ సిల్వ ప్రకటించారు. పురాతన గ్రీకు టెక్నిక్‌లకు, అధునాతనమైన కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ స్ట్రాటజీ (గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ)ని జోడించి జూలియన్ మహిళలకు స్థానాలు కేటాయిస్తుంటారు. 

మొదటి స్థానాన్ని దక్కించుకున్న జోడీ కామర్ అందానికి 98.7 శాతం స్కోరు లభించింది. ఈ లిస్టులో టాప్ ప్లేస్ కోసం జోడీ కామర్‌తో జెండయా, బెల్లా హడిడ్ పోటీ పడ్డారు. అయితే చివరకు జోడీనే తొలి స్థానంలో నిలిచింది. అందంలో 98.7 శాతం స్కోరు సాధించిన ఆమె.. కచ్చితమైన ముఖాకృతికి 1.3 శాతం దూరంలోనే ఉండిపోయారు. 

జోడీ కామర్ తర్వాతి స్థానాల్లో నిలిచిన జెండయా 94.37 శాతం, బెల్లా హడిడ్ 94.35 శాతం స్కోరు సాధించారు. బియన్స్ 92.44 శాతం, అరియానా గ్రాండే 91.81 శాతం, టేలర్ స్విఫ్ట్ 91.64 శాతం, జోర్డాన్ డన్ 91.39 శాతం, కిమ్ కదర్షియాన్ 91.28 శాతం, దీపికా పదుకొణె 91.22 శాతం, హోయీన్ జంగ్ 89.63 శాతం స్కోరుతో టాప్–10లో ఉన్నారు. 

ఇక, ప్రస్తుతం దీపికా పదుకొణె చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. కింగ్ ఖాన్ షారుఖ్‌తో కలసి ‘పఠాన్’లో నటిస్తున్నారు. ‘వార్’ చిత్రం ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ ఫిల్మ్ లోనూ దీపిక యాక్ట్ చేస్తున్నారు. వీటితోపాటు అమెరికన్ కామెడీ మూవీ ‘ది ఇంటర్న్’లోనూ ఆమె కనిపించనున్నారు. ఇలా పలు చిత్రాల్లో నటిస్తూ దీపిక ఫుల్ బిజీగా ఉన్నారు.

కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో దీపికా పదుకొనె ఎంపిక అయ్యారని వార్తలు వస్తున్నాయి. ‘XXX – ది రిటర్న్‌ ఆఫ్‌ జెండర్‌‌ కేజ్’ సినిమాతో హాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు దీపిక. దీంతో హాలీవుడ్‌లో కూడా మహేష్‌బాబు (MaheshBabu)తో తెరకెక్కించనున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 రిలీజ్‌ చేస్తుండటంతో.. ఈ సినిమాకు కూడా ఆమె క్రేజ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట రాజమౌళి. దీంట్లో ఎంత నిజముందో తెలియదు. ఈ విషయంపై జక్కన్న లేదా దీపికల్లో ఎవరు ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. 

Read more: అవసరమైతే ఆ విషయాన్ని నా రక్తంతో రాసిస్తా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సంచలన కామెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!