Unstoppable With NBK Season2: ప్రభాస్ (Prabhas), గోపీచంద్ (Gopichand), బాలయ్య.. అదరగొడుతున్న ‘అన్ స్టాపబుల్’ ప్రోమో!

Updated on Dec 18, 2022 02:42 PM IST
ప్రోమో లో (Unstopabble Promo) ముందుగా నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలి అని బాలయ్య చెప్పడంతో.. అలాగే 'డార్లింగ్ సార్' అని ప్రభాస్ అని నవ్వులు పూయించారు.
ప్రోమో లో (Unstopabble Promo) ముందుగా నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలి అని బాలయ్య చెప్పడంతో.. అలాగే 'డార్లింగ్ సార్' అని ప్రభాస్ అని నవ్వులు పూయించారు.

Unstoppable With NBK Season2: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్2’ ప్రోమో వచ్చేసింది. ఫుల్ ఎపిసోడ్ డిసెంబరు 30న ఆహా ఓటీటీ యాప్ లో ప్రసారం కానుంది. ఈ షో గత వారం రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ ఎపిసోడ్ ప్రోమో కోసం ఊరిస్తూ వచ్చింది ఆహా మీడియా.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెన్సేషనల్ టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’ కార్యక్రమం తాజా ఎపిసోడ్ కు టాలీవుడ్ కథానాయకులు ప్రభాస్, గోపీచంద్ విచ్చేశారు. ఈ ప్రోమో లో ప్రభాస్ కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు బాలకృష్ణ. అనంతరం డార్లింగ్ ప్రభాస్ ను బాలయ్యతో కలిసి గోపిచంద్ ఓ ఆటాడుకున్నారు. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ ప్రోమో కి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ప్రోమో లో (Unstopabble Promo) ముందుగా నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలి అని బాలయ్య చెప్పడంతో.. అలాగే 'డార్లింగ్ సార్' అని ప్రభాస్ అని నవ్వులు పూయించారు. అనంతరం ప్రభాస్ పర్సనల్ విషయాలపై కూడా పలు ప్రశ్నలు సంధించారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి విషయం చర్చలోకి వచ్చింది. ఇంతకుముందు ఎపిసోడ్ లో శర్వానంద్ పెళ్లి.. నీ పెళ్లి తర్వాతనే కావొచ్చు అంటూ పరోక్షంగా లేవనెత్తారు బాలకృష్ణ. దీంతో స్పందించిన యంగ్ రెబల్ స్టార్.. 'నా పెళ్లి గురించి అడిగితే సల్మాన్ ఖాన్ తర్వాతే అనాలేమో' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. 

మరోవైపు.. డార్లింగ్ కు సంబంధించిన ఏదో సీక్రెట్ రివీల్ చేసేందుకు గోపీచంద్ (Gopichand) ప్రయత్నించగా.. ఒరేయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఇక ఆ తర్వాత గోపీచంద్ మీదకు ప్రభాస్ ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాలయ్య గోపీచంద్ కు అడ్డుగా నిలబడ్డారు. మరికొన్ని సీక్రెట్స్ రివీల్ చేసేందుకు ఫోన్ కాల్ ఉన్న రామ్ చరణ్ ప్రయత్నించగా.. ఒరేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండ్ ఆ.. శత్రువా అంటూ సరదాగా అడిగారు. చరణ్ లీక్ చేసిన న్యూస్.. రాణి గురించే కదా అంటూ అసలు విషయం బయటపెట్టాడు గోపీచంద్.  

అలాగే ప్రభాస్ (Prabhas) సినిమా ‘బుజ్జిగాడు’లోని ఫేమస్ డైలాగ్.. ’ఏండే ఏదైనా మాట్లాడండే.. పోనీ ఓ పాట పాడంగే’ అనే డైలాగ్ చెప్పి అలరించాడు డార్లింగ్. ఇక, ప్రోమో చివర్లో తన పెద్దనాన్న కృష్ణంరాజును తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు ప్రభాస్.

Read More: UnstoppablewithNBK2: ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే’లో ప్రభాస్ (Prabhas) స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. త్వరలో ప్రోమో విడుదల?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!