బాలకృష్ణ (BalaKrishna) - అనిల్ రావిపూడి సినిమా టైటిల్‌ ఏంటో తెలుసా? క్రేజీ టైటిల్‌ పెట్టనున్నట్టు టాక్!

Updated on Nov 01, 2022 05:19 PM IST
బాలకృష్ణ (BalaKrishna ) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు
బాలకృష్ణ (BalaKrishna ) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు

నందమూరి నటసింహం బాలకృష్ణ (BalaKrishna) పోయినేడాది అఖండ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ బొనాంజాగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే పవర్‌‌ఫుల్‌ టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్‌కుమార్‌‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇక, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్‌లో అలరిస్తారని అనిల్ ఇప్పటికే చెప్పారు.

బాలకృష్ణ (BalaKrishna ) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు

కీలకపాత్రలో శ్రీలీల..

బాలకృష్ణ – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల కీలకపాత్రలో నటించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా గురించిన అప్‌డేట్‌ ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు క్రేజీ టైటిల్‌ పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘రామారావు గారు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని సమాచారం.  బాలకృష్ణ (BalaKrishna) ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటి కంటే ఈ సినిమా వైవిద్యంగా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు చెప్పారు. అదే విధంగా టైటిల్‌ కూడా డిఫరెంట్‌గా ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోందని టాక్.

Read More : 'వీరసింహారెడ్డి'గా అలరించనున్న నందమూరి బాలకృష్ణ (BalaKrishna).. ఎన్‌బీకే107’ టైటిల్ ఫిక్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!