‘పెర్ఫామెన్స్‌కు పవర్‌‌హౌస్‌’ చిరంజీవి (Chiranjeevi).. గాడ్‌ఫాదర్ సక్సెస్‌పై నయనతార (Nayanthara) ట్వీట్

Updated on Oct 10, 2022 12:23 PM IST
మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన సినిమా గాడ్‌ఫాదర్. ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా కీలకపాత్రలో లేడీ సూపర్‌‌స్టార్ నయనతార (Nayanthara) నటించారు. దసరా కానుకగా విడుదలైన గాడ్‌ఫాదర్ సినిమా సూపర్‌‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. బుధవారం విడుదలైన గాడ్‌ఫాదర్ సినిమా శనివారం నాటికే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

గాడ్‌ఫాదర్ సినిమాకు ముందు నయనతార, చిరంజీవి జంటగా సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్‌పై నయనతార ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌ చేసిన సినీ ప్రేమికులకు, అభిమానులకు ట్వీట్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

చాలా స్పెషల్..

‘గాడ్‌ఫాదర్ సినిమా నాకు ఎంతో స్పెషల్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నందుకు ఆనందిస్తున్నాను. ముఖ్యమైన వ్యక్తులు, చక్కని టీమ్‌తో పని చేసిన కారణంగా గాడ్‌ఫాదర్ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం. ‘సైరా’ తర్వాత చిరంజీవితో మరోసారి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మంచి వ్యక్తి, గొప్ప నటుడు. పెర్ఫామెన్స్‌కు పవర్‌‌హౌస్‌ లాంటి వ్యక్తి చిరంజీవి (Chiranjeevi).

సెట్‌లో ఆయన ఉన్న ప్రతి క్షణాన్నీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. సత్యప్రియ వంటి బలమైన క్యారెక్టర్‌‌కు న్యాయం చేయగలనని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్‌రాజాకు థాంక్స్. సల్మాన్‌ఖాన్‌ను అందరూ ఎందుకు ప్రేమిస్తారో  సినిమాలో నటించిన తర్వాత తెలిసింది. సత్యదేవ్‌కు, చెల్లెలిగా నటించిన తాన్యాకు, ఈ సినిమాలో నా క్యారెక్టర్‌‌ అంత బాగా రావడానికి సహకరించిన తోటి నటీనటులకు నా ధన్యవాదాలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు నయనతార (Nayanthara).

Read More : కవల పిల్లలకు తల్లిదండ్రులైన విఘ్నేష్ శివన్-నయనతార (Vignesh Shivan-Nayanathara) జంట.. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!