ట్రోలర్స్‌పై మండిపడుతున్న రష్మికా మందన్న(Rashmika Mandanna)..ఇష్టమొచ్చినట్టు రాస్తే ఊరుకోనంటూ వార్నింగ్!

Updated on Nov 09, 2022 10:38 PM IST
నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగుతోపాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు
నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగుతోపాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు కన్నడ బ్యూటీ రష్మికా మందన్న(Rashmika Mandanna). రెండో సినిమా ‘గీత గోవిందం’తో నేషనల్​ క్రష్​గా మారిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో తక్కువ టైమ్ లోనే  స్టార్​ హీరోయిన్​గా ఎదిగింది. ‘పుష్ప’ సినిమాతో పాన్​ఇండియా లెవెల్‌లో పాపులర్​ అయిన ఈ భామకు బాలీవుడ్​లోనూ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే రష్మిక కెరీర్​ ప్రారంభం నుంచి సోషల్​ మీడియాలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ఈ భామపై రకరకాల గాసిప్స్​, రూమర్స్​ ఎప్పుడూ ట్రోల్ అవుతూనే ఉంటాయి. తాజాగా రష్మికా మందన్న తన మీద వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. చాలాకాలంగా తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్​ చేసింది.

అంతేకాదు ఇంత కాలం ట్రోల్స్‌ను మౌనంగా సహిస్తూ వచ్చానని, ఇప్పుడు స్పందించక తప్పడం లేదని చెప్పుకొచ్చారు రష్మిక.

నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగుతోపాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు

ముళ్లుంటాయని తెలుసు..

‘కొన్ని ఏళ్లుగా... నెలలుగా... వారాలుగా... రోజులుగా నన్ను కొన్ని విషయాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటి మీద మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నేను నా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ద్వేషాన్ని చవి చూస్తూ వస్తున్నాను. ఎన్నో ట్రోల్స్, ఎంతో నెగిటివిటీ. నేను ఎంచుకున్న దారిలో ముళ్లు ఉంటాయని నాకు తెలుసు. నన్ను అందరూ ఇష్టపడరని కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలని కోరుకోలేదు. నేను చెప్పని విషయాలను నాకు ఆపాదించి ఇంటర్నెట్‌లో ట్రోల్స్ చేసే తీరుతో నా గుండె బద్దలైంది. వివిధ ఇంటర్వ్యూలలో మాట్లాడిన విషయాలను బిట్లుబిట్లుగా చూపిస్తూ నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాటి వల్ల వ్యక్తిగత జీవితంలోనూ, నేను పని చేసే ఫిలిం ఇండస్ట్రీలోనూ నాకు గల బంధాలు ప్రమాదంలో పడుతున్నాయి. నిజంగా మేలు కోరి చేసే విమర్శలు మంచివే. వాటి వల్ల నన్ను నేను మెరుగుపరచుకుంటాను. కానీ ఇలా ద్వేషాన్ని చిమ్మడం ఏంటి? ఎంతో కాలంగా వీటి మీద ఊరుకుంటూ వచ్చాను. పట్టించుకోవద్దు అనుకున్నాను. కానీ రోజురోజుకూ ఇది మరింత పెరుగుతూ వస్తోంది’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చారు రష్మిక.

 రష్మిక పోస్టుపై సోషల్ మీడియాలో చాలా మంది స్పందిస్తున్నారు. ‘తెలిసిన వాళ్లు ద్వేషిస్తే బాధపడాలి కానీ నీ గురించి తెలియని వాళ్లు చేసే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో తెలిసిన వాళ్లు ఎవరూ నిన్ను ద్వేషించరు’ అని తెలుగు సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల పోస్ట్ చేశారు. ‘నిన్ను ద్వేషించే వాళ్లు లోలోపల నీలాగే బతకాలని అనుకుంటారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి. వాటి గురించి పట్టించుకోవద్దు. అంతకంటే నువ్వు చేయాల్సిన పెద్ద పనులు చాలా ఉన్నాయి’ అంటూ ప్రముఖ ఫోటోగ్రాఫర్ రవి కె చంద్రన్ అన్నారు. ట్విటర్‌లోనూ కొందరు రష్మిక (Rashmika Mandanna)కు మద్దతు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు.

Read More : ‘గీత గోవిందం’ కాంబో రిపీట్‌ ! విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)తో రష్మికా మందాన (Rashmika Mandanna) సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!