మహేష్‌బాబు (MaheshBabu) అభిమానులకు గుడ్‌న్యూస్.. త్రివిక్రమ్ సినిమా సెకండ్ షెడ్యూల్‌ ఎప్పటినుంచో తెలుసా?

Updated on Nov 09, 2022 06:42 PM IST
మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది
మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ షూటింగ్ పూర్తయ్యింది. ఔట్‌ అండ్ ఔట్ కమర్షియల్‌ హంగులతో సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో అయోధ్యలో అర్జునుడు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మహేష్‌బాబు అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయోధ్యలో అర్జునుడు సినిమాలో మహేష్‌బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ చాలా తక్కువ సమయంలో పూర్తి చేసింది చిత్ర యూనిట్. అనంతరం మహేష్‌బాబు తల్లి మరణించడంతో సెకండ్ షెడ్యూల్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది.

మహేష్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది

నెట్‌లో వార్త హల్‌చల్‌..

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలుకాకపోవడంతో మహేష్‌బాబు – త్రివిక్రమ్ మధ్య విభేదాలు తలెత్తాయని, దాంతో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ ఒక వార్త ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అయోధ్యలో అర్జునుడు సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్‌ నవంబర్ నెలాఖరు నుంచి జరగనున్నట్టు తెలుస్తోంది.

మహేష్‌ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఇద్దరికీ మంచి పేరు తెచ్చాయి. ఇక అయోధ్యలో అర్జునుడు సినిమాలో మహేష్‌బాబు ( MaheshBabu) సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్  భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఈసారైనా అనుకున్న సమయానికి రెండో షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి మరి.

Read More : సెన్సిబిలిటీ ఉండే కథలనే సెలెక్ట్‌ చేసుకుంటా..‘మది’ ఒక డిఫరెంట్‌ లవ్ స్టోరి: శ్రీరామ్‌ నిమ్మల(Shreeram Nimmala)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!