చియాన్ విక్రమ్‌తో జోడీ కట్టనున్న కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).. రెమ్యునరేషన్ ఎంతంటే?

Updated on Jul 13, 2022 11:27 PM IST
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty),  విక్రమ్‌
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), విక్రమ్‌

యశ్‌ హీరోగా నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్​2 సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). రాఖీ భాయ్​ మెచ్చిన రీనాగా ప్రేక్షకులను అలరించి సినిమా విజయంలో  కీలకపాత్ర పోషించారు. కేజీఎఫ్ సిరీస్​ భారీ విజయంతో శ్రీనిధికి సౌత్‌లోని అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే ప్రశాంత్​ నీల్​, జూనియర్​ ఎన్టీఆర్​ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పుడు కోలీవుడ్​ స్టార్​ హీరో చియాన్​ విక్రమ్​ సరసన నటిస్తున్న సినిమాకు భారీ రెమ్యునరేషన్​ తీసుకోబోతోందట.​ ‘కేజీయఫ్‌’ సక్సెస్‌తో ఆమెకు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ సరసన నటించే అవకాశం వచ్చింది.

కోబ్రా సినిమాలో విక్రమ్, శ్రీనిధి శెట్టి

రిలీజ్‌కు రెడీ అవుతున్న కోబ్రా..

విక్రమ్ – శ్రీనిధి శెట్టి కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కోబ్రా’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీనిధి తీసుకున్న రెమ్యునరేషన్‌ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

 ‘కేజీయఫ్‌’కు తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే ఈసారి ఆమె తీసుకుందని తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ విక్రమ్‌తో సినిమాకి ఆమె ఎంత తీసుకున్నారంటే.. అక్షరాలా రూ.ఆరు కోట్లు అట..!

కోబ్రా సినిమాలో విక్రమ్, శ్రీనిధి శెట్టి

కోలీవుడ్‌లోకి ఎంట్రీ..

విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. విభిన్నమైన కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో విక్రమ్‌ సరసన శ్రీనిధి సందడి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. అయితే, ఈ సినిమాలో నటించడం కోసం శ్రీనిధి రూ.ఆరు కోట్ల నుంచి ఏడు కోట్లు పారితోషికం తీసుకున్నారట. ‘కేజీయఫ్‌’కు రూ.3 కోట్లు మాత్రమే తీసుకున్నారని, ఆ సినిమా సక్సెస్‌తోనే ఆమె ఈసారి రూ.7 కోట్ల వరకూ డిమాండ్‌ చేశారని సమాచారం.

చిత్ర యూనిట్ కూడా శ్రీనిధి (Srinidhi Shetty) ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా,  అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై నిర్మితమైన కోబ్రా సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​.

 Read More : కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా నుంచి ‘ఈశ్వరుడే’ లిరికల్ సాంగ్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!