పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ఊతపదం ఏంటో తెలుసా! బుజ్జిగాడు సెట్‌లో షాకైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌

Updated on Oct 27, 2022 04:28 PM IST
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ సంఘటనను పూరీ జగన్నాథ్‌ గుర్తుచేసుకున్నారు
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ సంఘటనను పూరీ జగన్నాథ్‌ గుర్తుచేసుకున్నారు

ప్రభాస్ (Prabhas).. పాన్‌ ఇండియా స్టార్. ఈ పేరు చెబితే ఫ్యాన్స్‌ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఖుషీ అవుతారు. రెబల్ సినిమాతో మాస్ ఆడియన్స్‌కు, మిస్టర్ పర్‌‌ఫెక్ట్‌ సినిమాతో క్లాస్ ప్రేక్షకులకు, బాహుబలి సినిమాతో ఇండియాలో లెవెల్‌లో ఉన్న సినీ ప్రేమికులకు దగ్గరయ్యారు ప్రభాస్. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు చేస్తూ పాన్ వరల్డ్‌ హీరోగా ఎదుగుతున్నారు.

బుజ్జిగాడు సినిమా తర్వాత ప్రభాస్‌ని అందరూ 'డార్లింగ్‌' అని పిలవడం మొదలు పెట్టారు. ఆ సినిమాలో ప్రభాస్‌ ఎక్కువగా డార్లింగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతాడు. డార్లింగ్.. డార్లింగ్ అని చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. అప్పటి నుంచి ప్రభాస్‌ను అభిమానులందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటున్నారు. సినిమాలోనే కాదు నిజంగా కూడా ప్రభాస్ ఊతపదం ‘డార్లింగ్’. బుజ్జిగాడు సినిమా రాకముందు నుంచే ప్రభాస్.. తన ఫ్రెండ్స్‌ను డార్లింగ్‌ అని పిలిచేవారట.

ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ సంఘటనను పూరీ జగన్నాథ్‌ గుర్తుచేసుకున్నారు

ఇంటర్వ్యూలో కూడా..

ప్రభాస్ ఊతపదం డార్లింగ్ అని పూరీ జగన్నాథ్‌కు తెలీదట. బుజ్జిగాడు సినిమా సెట్‌లో పూరీని డార్లింగ్‌ అని పిలిచారట ప్రభాస్. అది నచ్చడంతో సినిమాలో ఆ ఊతపదాన్ని వాడేసినినట్లు పూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా ఒప్పుకున్నారు.
'బుజ్జిగాడు సినిమా సెట్స్‌లో ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలిచేవారు. నన్ను మాత్రమే అలా పిలుస్తున్నారని  చాలా ఆనందించాను. వేరే వాళ్లను కూడా ప్రభాస్‌ డార్లింగ్‌ అని పిలవడం చూశాను. అప్పుడే అర్ధమైంది డార్లింగ్ అనేది  ప్రభాస్ ఊతపదం అని’ చెప్పారు పూరీ జగన్నాథ్‌.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్‌ ప్రస్తుతం ఓంరౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌ , 'కేజీఎఫ్‌'ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌’, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలు చేస్తున్నారు. వీటితోపాటు సందీప్‌ రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్‌ (Prabhas) సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read More : ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్‌ (Adipurush) టీజర్‌‌! న్యాయం చేతుల్లోనే అన్యాయానికి వినాశనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!