జపాన్‌లో కాసులు కురిపించిన టాప్‌8 భారతీయ సినిమాలు

Updated on Nov 23, 2022 04:48 PM IST
భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం
భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

సినిమా అంటే క్రేజ్.. సినిమా అంటే ఇమేజ్.. సినిమా అంటే రంగుల ప్రపంచం.. సినిమా అంటే కలెక్షన్లు..  ఏ భాషలో తెరకెక్కించినా కథ, కథనం  బాగుంటే వసూళ్ల వర్షం కురిపిస్తాయి సినిమాలు. భారతదేశంలోని ఏ భాషలో తెరకెక్కించిన సినిమా అయినా మన దేశంలో కలెక్షన్లు రాబట్టడం సాధారణ విషయమే.

ఇక, మన నేటివిటీ, సాంప్రదాయం, ఆలోచనా విధానాలతో తెరకెక్కించిన సినిమాలు వేరే దేశాల్లో కూడా వసూళ్లు రాబడుతున్నాయంటే అది మామూలు విషయం కాదు. జపాన్‌లో విడుదలై కాసులు కురిపించిన భారతీయ సినిమాల విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం..

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

ముత్తు :

రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన సూపర్‌‌డూపర్ హిట్ సినిమా ముత్తు. కేఎస్‌ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా హీరోయిన్‌గా నటించారు. ఏఆర్‌‌ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. తమిళంలో తెరకెక్కిన ముత్తు సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్‌ చేసి విడుదల చేశారు. హిందీలో ముత్తు మహారాజా పేరుతో రిలీజ్ అయ్యింది.

సూపర్‌‌ డూపర్‌‌ హిట్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించిన ముత్తు సినిమా జపాన్‌లో విడుదలైంది. జపాన్‌లో ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. సుమారు రూ.26 కోట్లు రాబట్టింది. అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన భారతీయ సినిమాగా మొదటి స్థానంలో ఉంది,

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ :

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Junior NTR), మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోలుగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డులు సృష్టించింది.

ప్రస్తుతం జపాన్‌లో కూడా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే జపాన్‌లో బాహుబలిని వెనక్కినెట్టి దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపుగా రూ.19.5 కోట్లు వసూలు చేసింది.

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

బాహుబలి2 :

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా బాహుబలి2. బాహుబలి సినిమాకు సీక్వెల్‌గా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అనే స్థాయిలో బాహుబలి సిరీస్ సినిమాలు హిట్ అయ్యాయి.

ఇక, బాహుబలి2 సినిమా జపాన్‌లో సినీ ప్రేమికులను విపరీతంగా అలరించింది. సుమారుగా రూ.19 కోట్లు కలెక్ట్ చేసింది.

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

3 ఇడియట్స్‌ :

ఆమిర్‌‌ఖాన్ (Aamir Khan), మాధవన్ (Madhavan), శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సూపర్‌‌హిట్ సినిమా 3 ఇడియట్స్. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 3 నేషనల్ సినిమా అవార్డులు సాధించింది. పూర్తిస్థాయి వినోదం అందించిన బెస్ట్‌ పాపులర్ సినిమాగా నిలిచింది.

హిందీలో తెరకెక్కించిన 3 ఇడియట్స్‌ సినిమాను నన్బన్ పేరుతో తమిళంలోకి రీమేక్ చేసి 2012లో విడుదల చేశారు. హిందీలో తెరకెక్కిన ఈ సినిమాను ‘3 ఇడియోటాస్‌’ పేరుతో జపాన్‌లో విడుదల చేయగా.. రూ.8.5 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది.  

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

ఇంగ్లీష్‌.. వింగ్లీష్ :

స్టార్ హీరోయిన్ శ్రీదేవి (Sridevi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిట్ సినిమా ‘ఇంగ్లీష్.. వింగ్లీష్’. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌‌ – 2012లో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన వారంతా 5 నిమిషాలపాటు నిల్చుని చప్పట్లు కొట్టారు. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ‘ఇంగ్లీష్.. వింగ్లీష్’ సినిమా దాదాపుగా రూ.102 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం.

ఇక, ఈ సినిమా జపాన్‌లో రిలీజై మంచి కలెక్షన్లు రాబట్టింది. రూ.8 కోట్లకుపైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

సాహో :  

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’.బాహుబలి వంటి సూపర్‌‌డూపర్‌‌ హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ప్రభాస్ నటన, యాక్షన్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

జపాన్‌లో విడుదలైన సాహో సినిమా అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. రూ.7.6 కోట్లు రాబట్టింది.

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

మగధీర :

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan) హీరోగా నటించిన రెండో సినిమా మగధీర. కాజల్ అగర్వాల్  (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించారు. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మగధీర సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. విడుదలైన అన్ని సెంటర్లలోనూ వసూళ్ల వర్షం కురిపించింది.

జపాన్‌లో విడుదలైన మగధీర సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. రూ.7 కోట్లపైనే వసూలు చేసింది.

భారతీయ చలన చిత్రాలకు ప్రపంచంలోని చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. జపాన్‌లో కూడా కోట్లు కలెక్ట్ చేసిన టాప్‌8 భారతీయ సినిమాలు ఏంటో తెలుసుకుందాం

రోబో :

రజినీకాంత్ (Rajinikanth), ఐశ్వర్యారాయ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా రోబో. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను బ్రేక్ చేసింది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన రోబో సినిమా సూపర్‌‌డూపర్‌‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

జపాన్‌లో విడుదలైన రోబో సినిమా దాదాపుగా రూ.6.4 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు జపాన్‌ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.

Read More : Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్న అత్యంత విలువైన టాప్‌5 వస్తువులు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!