IMDB Top 10 Movies: మోస్ట్ పాపులర్ సినిమాల్లో సౌత్ మూవీస్ హవా!.. జాబితాలో మూడు తెలుగు చిత్రాలకు దక్కిన చోటు

Updated on Dec 14, 2022 01:14 PM IST
మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల (IMDB Top 10 Movies) జాబితాలో తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ‘సీతారామం’, ‘మేజర్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి
మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల (IMDB Top 10 Movies) జాబితాలో తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ‘సీతారామం’, ‘మేజర్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి

భారతీయ చిత్ర పరిశ్రమ అంటే ఒకప్పుడు బాలీవుడ్ అనేలా ఉండేది. విదేశాల్లో కూడా ఇండియన్ సినిమాలు అంటే కేవలం హిందీ సినిమాలే అనే భావన ప్రబలంగా స్థిరపడిపోయింది. ప్రాంతీయ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చే సినిమాలను చిన్నచూపుతో చూసే భావన మొన్నటిదాకా ఉండేది. బాలీవుడ్ స్టార్స్‌ను మాత్రమే నేషనల్ స్టార్స్‌గా చూడటం మీడియాలోనూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. 

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) పుణ్యమా అని భారతీయ చిత్ర పరిశ్రమ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఫలానా ఇండస్ట్రీ, ఫలానా భాష అనే హద్దులు దాదాపుగా చెరిగిపోయాయి. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా చిత్రాలు రావడం షురూ అయ్యింది. జక్కన్న ఇచ్చిన ధైర్యంతో ప్రాంతీయ చిత్రాల దర్శక నిర్మాతలు తమ సినిమాలను మిగిలిన భాషల్లోకి అనువదించడం మొదలుపెట్టారు. దీంతో సరికొత్త చిత్రాల రాక ప్రారంభమైంది. ఈ ఒరవడి వల్ల అందరికంటే ఎక్కువగా సౌత్ మేకర్స్, స్టార్స్ లబ్ధి పొందుతున్నారు. 

 ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) పుణ్యమా అని భారతీయ చిత్ర పరిశ్రమ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.

‘బాహుబలి’ తర్వాత ‘కేజీఎఫ్​’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కార్తికేయ 2’, ‘కాంతార’ లాంటి సినిమాలు పాన్ ఇండియా హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు సౌత్ సినిమాల వైపు మొత్తం దేశం దృష్టి సారిస్తోంది. ప్రభాస్, యష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్​, రిషబ్ శెట్టి అంటే నార్త్ ఆడియెన్స్‌లో క్రేజ్ ఓ లెవల్లో పెరిగిపోయింది. ఈ విషయాన్ని అటుంచితే.. సినిమాల రివ్యూలు, రేటింగ్స్ ఇచ్చే సంస్థల్లో ఐఎండీబీకి ఉన్న పేరు గురించి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాలేంటో వెల్లడించింది. ఇందులో సౌత్ సినిమాలదే హవా నడిచింది.

ఐఎండీబీ విడుదల చేసిన ఇండియన్ మోస్ట్ పాపులర్ టాప్–10 మూవీస్ (IMDB Top 10 Movies) జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానంలో హిందీ మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చోటు సంపాదించింది. ఇక మూడో ప్లేసులో ‘కేజీఎఫ్​ 2’ (KGF 2), నాలుగో స్థానంలో ‘విక్రమ్’ (Vikram Movie), ఐదో స్థానంలో ‘కాంతార’ (Kantara) నిలిచాయి. ఈ జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో ‘రాకెట్రీ’, ‘మేజర్’ (Major) ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ‘సీతారామం’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘777 చార్లీ’ సినిమాలు నిలిచాయి. 

ఈ ఏడాది ప్రేక్షకులు మనసులు గెలుచుకున్న చిత్రాల్లో ‘రాకెట్రీ’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాలీవుడ్‌లో రూపొందగా.. మిగిలినవన్నీ సౌత్ సినిమాలే కావడం విశేషం. పైగా తెలుగుకు సంబంధించి మూడు సినిమాలు ఈ లిస్టులో చోటు సంపాదించాయి. మొత్తానికి భారతీయ బాక్సాఫీస్ వద్ద మన సినిమాలు ఓ రేంజ్‌లో సత్తా చాటుతున్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. 

Read more: మొదటి సినిమా టైటిల్‌తో పాపులర్ అయిన టాలీవుడ్ టాప్‌10 సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!