పాన్ ఇండియా రేంజ్ లో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘విరూపాక్ష’ (Virupaksha).. రేపే టైటిల్ గ్లింప్స్ రిలీజ్!

Updated on Dec 13, 2022 07:16 PM IST
ఇవాళ మరో అప్డేట్‌ ఇచ్చింది ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్ర బృందం. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మిగిలిన భాషల్లో కూడా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇవాళ మరో అప్డేట్‌ ఇచ్చింది ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్ర బృందం. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మిగిలిన భాషల్లో కూడా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వైవిధ్యమైన సినిమాలతో ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ఈ యంగ్ హీరో పలు ఆసక్తికర సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే పెద్ద ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఈ యువ హీరో తన కెరీర్ లో 15వ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నారు.

ఈ నేపథ్యంలో సాయిధరమ్ కు SDT15వ చిత్రం మంచి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కిస్తుండగా.. ‘కాంతార’ (Kantara) ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత బుధవారం ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.

అయితే, ఇవాళ మరో అప్డేట్‌ ఇచ్చింది ‘విరూపాక్ష’ (Virupaksha) చిత్ర బృందం. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మిగిలిన భాషల్లో కూడా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ ను రేపు (డిసెంబర్ 14న) ఉదయం 10:30 గంటలకు రిలీజ్‌ కానున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది.

‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై సంయుక్తంగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ‘విరూపాక్ష’లో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, ‘విరూపాక్ష’ కథ విషయానికి వస్తే.. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్ లో జరిగే కథ అని తెలుస్తోంది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Read More: మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ (Saidharam Tej) బర్త్‌డే స్పెషల్.. 'SD15' నుంచి ఆసక్తికర పోస్టర్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!