‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాటకు అరుదైన గుర్తింపు.. ఆస్కార్ (Oscar) అవార్డు దక్కేనా?

Updated on Dec 22, 2022 10:59 AM IST
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీరవాణి కంపోజ్ చేసిన పాపులర్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu Song) బెస్ట్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీరవాణి కంపోజ్ చేసిన పాపులర్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu Song) బెస్ట్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది.

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) అత్యద్భుతంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి అలరించారు. అయితే, ఇప్పటివరకు మరే ఇండియన్ సినిమాకూ దక్కని విధంగా హాలీవుడ్ ప్రేక్షకులు, విశ్లేషకుల నుంచి ప్రశంసలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కాయి.

ఇటీవల కొన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా అవార్డ్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి దర్శకుడు రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్, లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. 

అంతేకాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూడు కేటగిరీల్లో నామినేట్ కావడమే కాక తాజాగా ఫిలడెల్ఫియా ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలింతో పాటు బెస్ట్ సౌండ్ ట్రాక్ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైంది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ దిశగా అడుగులేస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీరవాణి కంపోజ్ చేసిన పాపులర్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu Song) బెస్ట్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఆస్కార్‌కు పోటీపడుతున్న మొత్తం 81 ట్యూన్స్‌ నుంచి 15పాటలను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. వాటిలో ‘నాటు నాటు’తోపాటు ‘అవతార్‌-2’లోని ‘నథింగ్‌ ఈ లాస్ట్‌’, బ్లాక్‌ పాంథర్‌లోని ‘లిఫ్ట్‌ మీ అప్‌’, టాప్‌ గన్‌ సినిమాలోని ‘హోల్డ్‌ మై హాండ్‌’ వంటి పాటలు ఉన్నాయి. అయితే, ఈ 15 సినిమాల్లో ఐదు మూవీస్‌ను జ‌న‌వ‌రిలో ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ సినిమాలు మాత్రమే ఆస్కార్‌కు పోటీప‌డ‌తాయి.

ఆస్కార్ అకాడమీ (Oscar Academy) నామినేషన్లను జనవరి 24, 2023న ప్రకటిస్తుంది. ఇక 95వ అకాడమీ అవార్డుల ఫైనల్ ఈవెంట్ 2023 మార్చి 12న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించబడుతుంది.

Read More: న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి (SS Rajamouli) మరో ప్రతిష్టాత్మక అవార్డు..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!