సరోగసి వార్తలకు చెక్ పెట్టిన రామ్ చరణ్ (Ram Charan).. ఉపాసన బేబీ బంప్ (Upasana Baby Bump) ఫొటోలు వైరల్!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మూడోతరం రాబోతోందన్న వార్త విని జూనియర్ రామ్ చరణ్ రాబోతున్నాడోచ్ అంటూ పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్-ఉపాసన సహజ పద్దతిలో కాకుండా సరోగసి (surrogacy) ద్వారా పిల్లల్ని కంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లను సోషల్ మీడియాలో కొన్ని వెబ్ సైట్లు పుట్టిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కానీ, రామ్ చరణ్ కానీ ఎక్కడా స్పందంచలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలన్నింటికీ ఒక్క ఫొటోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది ఉపాసన కామినేని (Upasana Kamineni). అదెలాగంటే.. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఉపాసన తన భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లి అక్కడ మధుర క్షణాలను గడుపుతోంది. ఇందులో భాగంగా వారందరితో సరదాగా గడుపుతూ.. పెద్దవారి ఆశీస్సులు కూడా తీసుకుంది.
ఈ క్రమంలో దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకుంది ఉపాసన. ఇక, ఆ ఫొటోల్లో తన బేబీ బంప్ (Upasana Baby Bump) స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సరోగసి అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో ఉపాసన.. రామ్‌చరణ్‌తో పాటు పలువురు సన్నిహితులతో కలిసి బీచ్‌లో సందడి చేస్తున్నారు.