21 ఏళ్లు.. 12 సినిమాలు.. ఫెయిల్యూర్‌‌ ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli).. బర్త్‌డే స్పెషల్‌

Updated on Oct 10, 2022 06:27 PM IST
బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).
బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌‌లోని మాస్ యాంగిల్‌ను ప్రేక్షకులకు రుచి చూపించినా.. మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌తో పవర్‌‌ప్యాక్డ్‌ పర్ఫామెన్స్ చేయించినా.. మాస్ మహారాజ్‌ రవితేజలోని సెంటిమెంట్‌ యాంగిల్‌ను బయటపెట్టినా.. యంగ్ హీరో నితిన్‌కు భారీ హిట్ అందించినా..ఈగను హీరోగా పెట్టి హిట్‌ అందుకున్నా..యంగ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌‌ను చేసినా ఆయనకే చెల్లింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశానికి చాటిన ఘనుడు.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో ఆ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ధీరుడు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli). నేడు రాజమౌళి పుట్టినరోజు.. ఈ సందర్భంగా పింక్‌విల్లా ఫాలోవర్స్‌ కోసం ప్రత్యేక కథనం..

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినబడుతోంది. బాహుబలి సినిమాతో బాక్సాఫీస్‌ చరిత్రను తిరగరాశారు రాజమౌళి. ఈ సినిమాతో యంగ్‌ రెబల్ స్టార్‌‌ను పాన్ ఇండియా స్టార్‌‌ను చేశారు. ఇండస్ట్రీలో రికార్డులు, కలెక్షన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే స్థాయిలో రికార్డులు సృష్టించారు. ఇక, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో మరో అడుగు ముందుకు వేశారు రాజమౌళి. ఈ సినిమాతో భారతదేశ సినిమా రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజమౌళి సినిమా చేస్తున్నారంటే తప్పకుండా రికార్డులు సృష్టిస్తుందని ఫిక్స్‌ అయిపోతున్నారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2001లో వచ్చిన స్టూడెంట్‌ నం.1 నుంచి తాజాగా విడుదలైన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం 12 మాత్రమే. ఈ 21 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఆయన దర్శకత్వం వహించిన వాటిలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్‌ కాలేదు. ఒకదానిని మించి మరొకటి హిట్‌ టాక్‌తో సంచలనం సృష్టించాయి.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌‌తో..               

యంగ్‌ టైగర్‌‌ ఎన్టీఆర్‌ (Junior NTR)‌ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నం.1 సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌కు హీరోగా ఫస్ట్‌ సక్సెస్‌ను అందించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. కేవలం రూ.1.85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టూడెంట్‌ నం.1 సినిమా దాదాపుగా రూ.12 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌ వసూలు చేసింది.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌‌తో సింహాద్రి సినిమాను తెరకెక్కించారు రాజమౌళి (SS Rajamouli). సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మాస్‌ హీరోగా ఎన్టీఆర్‌‌ను ఈ సినిమా నిలబెట్టడమే కాకుండా స్టార్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. రూ.8.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన సింహాద్రి సినిమా రూ. 26 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌ కలెక్ట్‌ చేసింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

నితిన్‌తో ‘సై’

జయం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నితిన్ (Nithiin). ఈ సినిమా సక్సెస్‌తో అవకాశాలు బాగానే వచ్చినా మాస్‌ హీరో ఇమేజ్‌ను సంపాదించుకోలేకపోయారు. ఈ సమయంలోనే నితిన్‌తో ‘సై’ సినిమాను తెరకెక్కించారు రాజమౌళి. రూ.10.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సై.. దాదాపుగా రూ.11 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌ కలెక్ట్‌ చేసింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

‘ఛత్రపతి’ సినిమాతో..                                                        

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ప్రభాస్ (Prabhas). మాస్ హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ప్రభాస్ కెరీర్‌‌లో సరైన హిట్‌ దక్కలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో రాజమౌళి ‘ఛత్రపతి’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రభాస్‌కు మాస్‌ హీరో ఇమేజ్ వచ్చింది. ప్రభాస్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టి మార్కెట్‌తో ప్రభాస్‌ రేంజ్‌ను పెంచింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఛత్రపతి సినిమా రూ.22 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌ కలెక్ట్‌ చేసి బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

డబుల్‌ రోల్‌లో మాస్‌ మహరాజా..

మాస్ మహరాజా రవితేజ (RaviTeja)ను మొదటిసారి డబుల్‌రోల్‌లో చూపించి ఆయన అభిమానులను అలరించారు రాజమౌళి. పవర్‌‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌‌గా, పిక్‌పాకెటర్‌‌గా విక్రమార్కుడు సినిమాలో రవితేజలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసి హిట్‌ కొట్టారు. దాదాపు రూ.11 కోట్లతో తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా రూ.23 కోట్ల వరకు వరల్డ్‌వైడ్‌ షేర్‌‌ వసూలు చేసింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌‌తో..

రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR)‌ కాంబినేషన్‌లో వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌‌1, సింహాద్రి సినిమాలు ఎంత పెద్ద హిట్ సాధించాయో తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూడో సినిమాగా యమదొంగ తెరకెక్కింది. ఈ సినిమాలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌‌ గెటప్స్, డ్యాన్స్‌, డైలాగ్స్‌కు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. రూ.18 కోట్లతో తీసిన యమదొంగ సినిమా రూ.29 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

రాంచరణ్‌ ‘మగధీర’తో..

చిరంజీవి కొడుకుగా ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన రాంచరణ్‌ (RamCharan)తో భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ప్లాన్ చేశారు రాజమౌళి. మగధీర టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది. అంతేకాదు రెండో సినిమాతోనే రాంచరణ్‌కు స్టార్‌‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. రూ.44 కోట్లతో తెరకెక్కించిన మగధీర సినిమా దాదాపుగా రూ.78 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌, రూ.150 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

సునీల్‌తో ‘మర్యాదరామన్న’  

స్టార్ కమెడియన్ సునీల్‌ను హీరోగా పెట్టి.. డిఫరెంట్ స్టోరీతో మర్యాదరామన్న సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. కమెడియన్‌గా సినిమాలు చేస్తూనే హీరోగా చిన్న చిన్న సినిమాలు చేస్తున్న సునీల్‌కు మర్యాదరామన్న సినిమా బ్రేక్ ఇచ్చింది. సలోని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో రాజమౌళి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. రూ.14 కోట్లతో తీసిన మర్యాదరామన్న సినిమా రూ.29 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌, రూ.40 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ వసూలు చేసింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

నానితో ‘ఈగ’..

హీరోలకు స్టార్ ఇమేజ్‌ తేవడంలో స్పెషలిస్ట్ అయిన రాజమౌళి.. ‘ఈగ’ సినిమాతో గ్రాఫికల్‌ వండర్‌‌ను సృష్టించారు. నేచురల్ స్టార్ నాని (Nani), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో నిజానికి హీరో ఈగ అనే చెప్పాలి. సినిమాలో నాని క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు. సమంత, ఈగ మధ్య వచ్చే సన్నివేశాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈగ సినిమా రూ.54 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌, రూ.125 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ కలెక్ట్ చేసి బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

‘బాహుబలి’ సిరీస్‌తో..

ఛత్రపతి తర్వాత రాజమౌళి (SS Rajamouli) – ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా బాహుబలి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలు తెలుగు సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేశాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన బాహుబలి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు తెలుగు సినిమా మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేలా చేసింది. బాహుబలి సిరీస్‌ సినిమాలతో దర్శకుడు రాజమౌళితోపాటు, ప్రభాస్ క్రేజ్‌ కూడా విపరీతంగా పెరిగింది. బాహుబలి1 రూ.180 కోట్లతో తెరకెక్కగా.. రూ.302 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌‌, రూ.650 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్ వసూలు చేసింది. ఇక, బాహుబలి2 రూ.250 కోట్లతో తెరకెక్కి రూ.831 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌, రూ.1,810 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ కలెక్ట్ చేసింది.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

తాజాగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌..

బాహుబలి సిరీస్ సినిమాలతో భారీ క్రేజ్‌ తెచ్చుకున్న రాజమౌళి (SS Rajamouli) చాలాకాలం గ్యాప్ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ (Junior NTR)‌, మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan)తో ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా టేకింగ్, గ్రాఫిక్స్, ఎడిటింగ్, కథ, దర్శకత్వం సహా అన్ని కేటగిరీల్లోనూ మంచి క్రేజ్‌ తెచ్చుకోవడంతో రాజమౌళి క్రేజ్‌ మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. రూ.550 కోట్లతో తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ రూ.624 కోట్ల వరల్డ్‌వైడ్‌ షేర్‌, రూ.1,200 కోట్ల వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌‌ కలెక్ట్ చేసినట్టు సమాచారం.

బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli).

ఇప్పుడు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో..

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబుతో సినిమా తెరకెక్కించడానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి మహేష్‌తో తెరకెక్కించే సినిమా కథను రాజమౌళి సిద్ధం చేస్తారని తెలుస్తోంది. పాన్ వరల్డ్‌ సినిమాగా మహేష్‌బాబు (MaheshBabu)రాజమౌళి (SS Rajamouli) సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ప్రిన్స్ అభిమానులతోపాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Read More : హాలీవుడ్‌ లీడింగ్‌ క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీతో రాజమౌళి (Rajamouli) ఒప్పందం.. మహేష్ బాబు సినిమా కోసమేనా?

తెలుగు సినిమా రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. మరిన్ని హిట్‌ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ..
పింక్‌విల్లా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!