మెగా-అల్లు ఫ్యామిలీలో క్రిస్మస్ సందడి.. 'సీక్రెట్ శాంట' కోసం ఒకే ఫ్రేములో రామ్ చరణ్ (Ram charan), అల్లు అర్జున్ (Allu Arjun)

Updated on Dec 21, 2022 02:49 PM IST
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) ఈ ఫోటోని షేర్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) ఈ ఫోటోని షేర్ చేసింది.

మెగా ఫ్యామిలీ ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రతీ ఏడాది టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ఈ ఆచారాన్ని అలాగే కొనసాగించడానికి నిర్ణయించారు. అయితే, ఈ వేడుకలలో భాగంగా వారు అత్యంత సన్నిహితులను సంబరాలకు ఆహ్వానిస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా-అల్లు ఫ్యామిలీ ప్రీ క్రిస్మస్ వేడుకను (Pre Christmas Celebrations) సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌, అల్లు బాబీ, సుష్మిత, సుష్మిత భర్త, శ్రీజ, స్నేహా రెడ్డి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ ఇలా అందరూ హాజరయ్యారు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) ఈ ఫోటోలని షేర్ చేసింది. మరోవైపు.. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా సీక్రెట్ శాంట అంటూ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మెగా హీరోలందరిని ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు.

అయితే, రామ్ చరణ్ (Ram Charan) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సారి క్రిస్మస్ వేడుకలను మెగా ఫ్యామిలీ మరింత గ్రాండ్ గా జరపడానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా, మెగా-అల్లు ఫ్యామిలీ దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ ఇలా అన్ని పండుగలను కూడా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Read More: Chiranjeevi: నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. తనయుడు చరణ్​ (Ram Charan) గురించి చిరు ఎమోషనల్ ట్వీట్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!