రెండు భాషల్లో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా? తారక్‌ ఓకే చెప్పారా!

Updated on Nov 15, 2022 08:52 PM IST
‘కేజీఎఫ్’తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’తో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) పాన్‌ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు
‘కేజీఎఫ్’తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’తో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) పాన్‌ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR). ఈ సినిమాలో తారక్‌ నటనకు అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయిపోయారు. తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ కొత్త రికార్డులను సృష్టించింది. ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాను విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా సినిమాకు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది.

ఇక, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ విడుదలై నెలలు గడుస్తున్నా తారక్ నటించే తదుపరి సినిమా షూటింగ్‌ మొదలుకాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పూర్తయిన తర్వాత.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో అందరి దృష్టి తారక్ – ప్రశాంత్‌నీల్‌ సినిమాపై పడింది.

‘కేజీఎఫ్’తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’తో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) పాన్‌ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు

ఆసక్తితో ఎదురుచూస్తున్న అభిమానులు..

కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ సినిమా మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్‌నీల్. కేజీఎఫ్1, 2 ఎంతటి సక్సెస్‌ సాధించాయో మనందరికీ తెలుసు. హీరో యష్‌ను మాస్ హీరోగా నిలబెట్టారు ప్రశాంత్‌నీల్. ఇక, ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌‌ ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతోందని ఇటీవల విడుదలైన పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది.

ఇక, జూనియర్ ఎన్టీఆర్‌‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా డైరెక్టర్‌‌గా ప్రశాంత్ నీల్‌కి ఫుల్ డిమాండ్ ఉంది. ఎన్టీఆర్‌‌తో భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా గురించిన ఆసక్తికర అప్‌డేట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎన్టీఆర్‌‌ (Junior NTR)తో చేయబోయే సినిమాను తెలుగుతోపాటు కన్నడ భాషలో కూడా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్‌నీల్ (Prashanth Neel). దీనికి తారక్‌ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా లేదా.. అసలు ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read More : పులులు అంటే నాకు చాలా ఇష్టం.. మా ఇంట్లో ఒక టైగర్‌ను పెంచుకోవాలనుకుంటున్నా: జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!