Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్న అత్యంత విలువైన టాప్‌5 వస్తువులు!

Updated on Nov 22, 2022 08:30 PM IST
టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.
టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.

బాక్సాఫీస్ ‘బాద్‌షా’.. రికార్డులను తిరగరాసే ‘కంత్రీ’.. డైలాగులతో విజిల్స్‌ వేయించే ‘సింహాద్రి’..అభిమానుల గుండెలను దోచుకునే ‘యమదొంగ’..డ్యాన్స్‌, ఫైట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే టాలీవుడ్‌ స్టార్ హీరో ‘జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌’ (యంగ్‌టైగర్ ఎన్టీఆర్).

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. తన నటన, అభినయంతో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాతోనూ నటుడిగా ఒక్కో మెట్టూ ఎక్కుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అభిమానుల ఆశీస్సులే అసలైన ఆస్తి అని చెప్పే తారక్ దగ్గర ఉన్న టాప్‌5 విలువైన వస్తువుల వివరాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం.. 

టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.

హైదరాబాద్‌లోని ఇల్లు..

సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీల వరకు ముందుగా ప్రెస్టీజియస్‌గా ఫీల్ అయ్యేది ఏదైనా ఉంది అంటే అది ఇల్లు. దాని కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలోనే జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ కూడా తన ఇంటి కోసం బాగానే ఖర్చు చేశారని టాక్.

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆయన నివాసం ఉండే ఇంటి ప్రస్తుత విలువ రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.

టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.

ప్రైవేట్‌ జెట్‌

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీర్‌‌ ఇటీవలే ప్రైవేటు విమానాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్స్‌, షూటింగ్స్‌ కోసం దీనిని ఉపయోగిస్తున్నారని సమాచారం.

ఈ ప్రైవేట్ విమానం విలువ సుమారుగా రూ.80 కోట్లు ఉంటుందని టాక్.

టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.

రిచర్డ్‌ మిల్లె ఎఫ్‌1 వాచ్‌..

తారక్‌కు వాచీలంటే విపరీతమైన పిచ్చి. వాటి కోసం ఆయన చాలానే ఖర్చు చేస్తారని టాక్. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చాలా వాచీలు ఉన్నప్పటికీ.. రిచర్డ్‌ మిల్లె ఎఫ్‌1 వాటిలో ఖరీదైనది. ఆ వాచ్ ధర రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు ఉండొచ్చని అంచనా.

టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.

లాంబోర్ఘిని ఉరుస్‌..

జూనియర్ ఎన్టీఆర్ కార్ల గ్యారేజ్‌లో కళ్లు చెదిరే మోడల్ కార్లు కనిపిస్తాయి. కార్లపై మోజు ఉన్న తారక్‌.. ఇండియాలోనే మొట్టమొదటి లాంబోర్ఘిని ఉరుస్‌ గ్రాఫైట్ కాప్స్యూల్‌ కారును కొనుగోలు చేశారు. దీని ధర 3.5 కోట్లు ఉంటుంది. దీనితోపాటు తారక్ గ్యారేజీలో రూ.2.3 కోట్ల విలువ చేసే రేంజ్‌ రోవర్‌‌ వోగ్, 1.32 కోట్లతో కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 720 ఎల్‌డీ, 1.25 కోట్ల విలువైన పోర్షే 718 కాయెన్నె, 90 లక్షల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్‌ జీఎల్‌ఎస్‌ 350డీ ఉన్నాయి.

టాలీవుడ్ టాప్‌ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే లగ్జరీ లైఫ్‌ను లీడ్‌ చేస్తుంటారు.

సుజుకీ హయాబుసా బైక్..

కార్లు, వాచీలే కాదు తారక్‌కు బైక్‌లంటే కూడా ఇష్టమే.ఆయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన బైక్‌ సుజుకీ హయాబుసా.

దీని ధర అక్షరాలా రూ.14 లక్షలు

Read More : ట్విట్టర్‌‌లో మిలియన్ల మంది ఫాలో అవుతున్న టాలీవుడ్‌ (Tollywood) టాప్‌10 స్టార్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!