UnstoppablewithNBK2: ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే’లో ప్రభాస్ (Prabhas) స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. త్వరలో ప్రోమో విడుదల?

Updated on Dec 14, 2022 12:43 PM IST
ప్రభాస్‌ (Prabhas) ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వైరల్‌ అవుతోంది. వీడియోలో ప్రభాస్‌ ని చూసి ప్రేక్షకులు హోరెత్తించారు.
ప్రభాస్‌ (Prabhas) ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వైరల్‌ అవుతోంది. వీడియోలో ప్రభాస్‌ ని చూసి ప్రేక్షకులు హోరెత్తించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమవుతూ.. తెలుగు టాక్‌ షోస్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే' సీజన్ 2 (UnstoppablewithNBK2). ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 ఊహించని రీతిలో విజయవంతం కావడంతో మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సీజన్ 2ని ప్లాన్ చేశారు.

అందుకు తగ్గట్లుగానే సీజన్‌ 2 షో రన్‌ అవుతోంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). నారా లోకేష్ తో ప్రారంభమైన ఈ షోలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

వారితోపాటు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్‌ సేన్‌ (Vishwak sen), సిద్దు జొన్నగడ్డ, శర్వానంద్, అడివి శేష్ (Adivi Sesh) హాజరై సందడి చేశారు. ఇక, టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌బాబు, దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వంటి దిగ్గజాలు సైతం హాజరై ప్రేక్షకులను అలరించారు. 

ఈ నేపథ్యంలో ఈ వారం రిలీజ్ కానున్న ఆరో ఎపిసోడ్‌కు ప్ర‌భాస్ (Prabhas) గెస్ట్‌గా హాజ‌రుకానున్నాడు. గత రెండు రోజులుగా ఈ విషయం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తూనే ఉంది. దీంతో తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ (Special Glimpse) రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ఇక, వీడియోలో ‘బాహుబ‌లి’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాయిస్ వినిపించ‌గానే యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ స్టైలిష్‌గా స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు.

అనంతరం.. ‘ఏయ్‌.. ఏం చెప్తున్నావ్‌ డార్లింగ్‌’ అని ప్రభాస్‌ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు బాలయ్య (Nandamuri Balakrishna) ప్రభాస్‌ని రమ్మని పిలవగా, డార్లింగ్‌ వద్దు సర్‌ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంటోంది. గోపీచంద్ చెప్పిన మాట‌ల‌కు ప్ర‌భాస్ స‌ర‌దాగా దండం పెట్టిన‌ట్లుగా వీడియోలో చూపించారు.  

కాగా.. ప్రభాస్‌ (Prabhas) ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్ వైరల్‌ అవుతోంది. వీడియోలో ప్రభాస్‌ ని చూసి ప్రేక్షకులు హోరెత్తించారు. ఫ్లయింగ్‌ కిస్సులతో ఫిదా చేశారు. డార్లింగ్‌ ప్రభాస్ కూడా వారికి ఫ్లయింగ్‌ కిస్సులివ్వడం విశేషం. కాగా, ఈ షోలో ప్రభాస్ తన పెళ్లి గురించ కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చనట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో హీరో రామ్ చరణ్ తో ఫోన్ కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ గ్లింప్స్ మంచి క్రేజ్ తో దూసుకుపోతుండడంతో త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమోని (Promo) విడుదల చేయనున్నట్లు తెలిపారు ఆహా యాజమాన్యం. మరోవైపు.. ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆహా టీమ్ త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Read More: "కృతి సనన్ (Kriti Sanon) మనసులో ఉన్న హీరో దీపికా పదుకొణెతో (Deepika Padukone) బిజీగా ఉన్నాడు": వరుణ్ ధావన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!