RC15: చరణ్ సినిమాలో మరో స్టార్ హీరో!.. కీలక పాత్రలో మోహన్ లాల్ (Mohan Lal) నటిస్తున్నారనే ప్రచారంలో నిజమెంత..?

Updated on Dec 19, 2022 06:13 PM IST
RC15: ఆర్‌సీ15లో మోహన్ లాల్ (Mohan Lal) నటించనున్నారని సమాచారం. చరణ్‌కు ఆయనకు మధ్య వచ్చే సీన్స్ శక్తిమంతంగా ఉంటాయని రూమర్స్ వినిపిస్తున్నాయి
RC15: ఆర్‌సీ15లో మోహన్ లాల్ (Mohan Lal) నటించనున్నారని సమాచారం. చరణ్‌కు ఆయనకు మధ్య వచ్చే సీన్స్ శక్తిమంతంగా ఉంటాయని రూమర్స్ వినిపిస్తున్నాయి

‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ (Ram Charan) ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మధ్య సరైన హిట్లు లేక సతమతమవుతున్న శంకర్.. చెర్రీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని ఆయన కసితో ఉన్నారు.

ఇటు చరణ్​ మూవీతోపాటు అటు కమల్ హాసన్ సినిమా ‘భారతీయుడు 2’ను కూడా శంకర్ ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చెర్రీ చిత్రం న్యూజిలాండ్‌లో ఓ పాటను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్​ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు చెబుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal)ను తీసుకున్నారని వినికిడి. 

రామ్ చరణ్​ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal)ను తీసుకున్నారని వినికిడి

శంకర్–చరణ్​ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో మోహన్ లాల్ నటించనున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో వచ్చే ఈ క్యారెక్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చెర్రీ–మోహన్ లాల్ మధ్య వచ్చే సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నాయని సమాచారం. దీనిపై మోహన్ లాల్ నుంచి గానీ మూవీ యూనిట్ నుంచి గానీ ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. 

ఇక శంకర్ సినిమా (RC15)లో చరణ్​ స్టయిలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఒకటి గ్రామీణ యువకుడిగా, మరొకటి మోడ్రన్ లుక్‌లో సాగుతుందని వినికిడి. దీనికి సంబంధించి షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన పలు ఫొటోలు అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. చెర్రీ లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించిన మూవీ టీమ్ అందుకోసం హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్‌ను రంగంలోకి దింపింది. చెర్రీని హకీమ్ ఇంకా అందంగా చూపిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. మొత్తానికి భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న చరణ్​ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

Read more: TOLLYWOOD CELEBS : టాలీవుడ్‌లో వీళ్లిద్దరి మధ్య బంధుత్వం ఉందని మీకు తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!