రాంచరణ్ (RamCharan) – శంకర్ సినిమాలో పాట కోసం ఎంత బడ్జెట్‌ పెడుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Updated on Nov 16, 2022 06:52 PM IST
రాంచరణ్‌ (Ram Charan), కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది
రాంచరణ్‌ (Ram Charan), కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది

రాంచరణ్‌ (RamCharan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. RC15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలకు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఒక పాట కోసం రూ.8 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఆర్‌‌సీ15 సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చరణ్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత రాంచరణ్ నటిస్తున్న సినిమా కావడం, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మరో పాటను కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

రెండు వారాల్లో..

నవంబర్ 20 నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు దాదాపు రెండు వారాలు ఈ పాట చిత్రీకరణ జరపనున్నారు. రూ.15 కోట్లతో న్యూజిల్యాండ్‌లో ఈ పాటను షూట్‌ చేయనున్నారని టాక్‌. సాధారణంగా శంకర్‌ సినిమాలోని పాటలు ఒక రేంజ్‌లో ఉంటాయి. గతంలో జీన్స్‌ సినిమాలోని ‘పువ్వుల్లో దాగున్న..’ సాంగ్‌, అపరిచితుడు సినిమాలోని ‘ఓ సుకుమారి..’ ఇలా ప్రతి సినిమాలో శంకర్‌ ఒక పాటను అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తారు.

ఇప్పుడు రాంచరణ్‌ (RamCharan), కియారా అద్వానీలపై శంకర్ తెరకెక్కించనున్న పాట గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read More : జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) పై దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సంచలన కామెంట్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!