చిరంజీవి నుంచి సాయికుమార్ వరకు.. విలన్‌లుగా వచ్చి హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్లు
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అన్ని రకాల పాత్రలు పోషించే సత్తా ఉండాలి. దానికి అదృష్టం తోడు కావాలి. ముఖ్యంగా హీరోగా రాణించాలంటే మామూలు విషయం కాదు. సినిమాలో హీరోగా ఎంపిక కావాలన్నా.. ప్రేక్షకులను మెప్పించాలన్నా ఎంతో కష్టపడాలి. ఇండస్ట్రీలోకి ఏదో విధంగా వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూనే హీరో వేషాల కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు.
వారిలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా స్థిరపడుతూ ఉంటారు. టాలీవుడ్‌తోపాటు అన్ని ఇండస్ట్రీలలోనూ ఇటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. ఎవరి సహకారం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అనంతరం విలన్‌గా అలరించి.. హీరో అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోలుగా ఎదిగిన టాలీవుడ్ టాప్5 స్టార్ల గురించిన విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా..
చిరంజీవి (Chiranjeevi) :
మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పేరు చెబితే చాలు కోట్ల మంది అభిమానుల గుండెలు ఉప్పొంగుతాయి. డాన్స్, స్టైల్, యాక్షన్‌తో అలరించడమే కాకుండా సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సహాయం చేయడంలోనూ ముందుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల పల్లెటూరి నుంచి వచ్చి ఎవరి సహకారం లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎవరూ అందుకోలేని, ఊహించనంత ఎత్తుకు ఎదిగారు చిరంజీవి. అయితే అదంతా ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. అనంతరం విలన్‌గా నటించారు. గెస్ట్ రోల్స్ చేశారు. పున్నమినాగు సినిమాలో చేసిన నెగెటివ్ రోల్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో మైలురాయిగా చెప్పుకోవాలి.
ఆ సినిమా తర్వాత పూర్తిస్థాయి హీరోగా మారిన చిరంజీవి.. తనదైన బ్రేక్ డాన్స్‌తో అభిమానులను అలరిస్తూ సుప్రీం హీరోగా.. మెగాస్టార్‌గా ఎదిగారు. ఇప్పటివరకు 150కు పైగా సినిమాల్లో నటించిన చిరు ఇటీవల నటించిన గాడ్‌ఫాదర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
రజినీకాంత్ (Rajinikanth) :
భారతదేశంలోని టాప్ హీరోల్లో రజినీకాంత్ ఒకరు. తన స్టైల్, హార్డ్‌వర్క్‌తో సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజినీకి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. సినిమాల్లో ఎంత స్టైల్‌గా ఉండే రజినీకాంత్.. నిజజీవితంలో చాలా సింపుల్‌గా ఉంటారు.
కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో విలన్‌గా నటించారు రజినీకాంత్. నేరుగా తెలుగులో చేసిన సినిమాలు లేనప్పటికీ దళపతి, బాషా, ముత్తు, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో వంటి సూపర్‌హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
ఇప్పటివరకు 165కుపైగా సినిమాల్లో నటించిన రజినీకాంత్ (Rajinikanth).. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘రోబో’లో డబుల్ యాక్షన్ చేశారు. అందులో ఒకటి హీరో పాత్ర కాగా.. మరో క్యారెక్టర్‌లో విలన్‌గా నటించి మెప్పించారు.
మోహన్‌బాబు (MohanBabu) :
విలన్, హీరో, నిర్మాత, దర్శకుడుగా టాలీవుడ్‌కు సుపరిచితులు డైలాగ్ కింగ్ మోహన్‌బాబు. విలక్షణమైన డైలాగ్ డిక్షన్, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 1974వ సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు సినిమాతో మొదలైన మోహన్‌బాబు సినీ ప్రస్థానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది.
ఇండస్ట్రీలోని చాలామంది హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన మోహన్‌బాబు.. హీరో కాకముందు విలన్‌గా చాలా సినిమాల్లో నటించారు. విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ 530కు పైగా సినిమాల్లో నటించారు మోహన్‌బాబు.
మోహన్‌బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ సినిమాలోకి వచ్చినప్పటికీ.. మోహన్‌బాబు (MohanBabu) స్టార్‌డమ్‌ను చేరుకోలేకపోతున్నారు. ఇటీవల సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ.. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
శ్రీకాంత్ (Srikanth) :
ఫ్యామిలీ హీరోగా అందరికీ బాగా దగ్గరయ్యారు శ్రీకాంత్. తనదైన నటన, అందంతో పక్కింటి అబ్బాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. 1991లో వచ్చిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు శ్రీకాంత్. ఈ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషించారు.
పెళ్లాం చెబితే వినాలి, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అబ్బాయిగారు సినిమాలతోపాటు పలు చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు శ్రీకాంత్. ఈ సినిమాల తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించినా.. పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అనంతరం పలు హిట్ సినిమాల్లో నటించి మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగారు శ్రీకాంత్ (Srikanth). కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పాపులర్ అవుతున్న శ్రీకాంత్.. మళ్లీ విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. అఖండ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు.
సాయికుమార్
డబ్బింగ్ ఆర్టిస్ట్, హీరో, విలన్, యాంకర్.. వీటన్నింటినీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న నటుడు సాయికుమార్. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘సంసారం’ సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్‌గా మారారు. దేవుడు చేసిన పెళ్లి సినిమాలో బాలనటుడిగా చేసిన సాయికుమార్.. మధుసూదనరావు దర్శకత్వం వహించిన జేబుదొంగ సినిమాలో నటించారు.
పలు సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు సాయికుమార్ (SaiKumar). తన బేస్ వాయిస్‌తో విలన్లకు డబ్బింగ్ చెప్పే క్రమంలో పోలీస్ స్టోరీ, అంత:పురం సినిమాల్లో హీరోగా నటించి అలరించారు. ఈ సినిమాల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, పలు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
సాయికుమార్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చారు ఆది సాయికుమార్. ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆది.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Read More : అలీ నుంచి సుడిగాలి సుధీర్ వరకు..హీరోలుగానూ సినిమాలు చేసిన టాప్10 టాలీవుడ్ కమెడియన్లు