‘ఇండియన్‌2’ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).. వీడియో షేర్ చేసిన చందమామ

Updated on Sep 25, 2022 06:24 PM IST
కలరియపట్టు ప్రాక్టీస్ చేస్తున్నట్టు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది
కలరియపట్టు ప్రాక్టీస్ చేస్తున్నట్టు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తల్లి అయ్యారు. నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ చందమామ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కమల్‌ హాసన్‌ – శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇండియన్‌2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కాజల్.. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు, ఆ తర్వాత టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో నటించారు. గర్భవతి అయిన కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నారు కాజల్.

కలరియపట్టు ప్రాక్టీస్ చేస్తున్నట్టు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది

హ్యాష్‌ట్యాగ్‌ కూడా..

కాజల్ అగర్వాల్.. మగబిడ్డకు జన్మనిచ్చి సుమారు నాలుగు నెలలు గడిచింది. ఈ కారణంగా కాజల్ కొంచెం బరువు పెరిగి బొద్దుగా మారారు. ప్రస్తుతం ఇండియన్‌2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నట్టు సోషల్ మీడియా ద్వారా కాజల్ తెలిపారు కూడా. ఈ క్రమంలోనే ఆమె తన శరీరాకృతిపై దృష్టి పెట్టి బరువు తగ్గడానికి కసరత్తులు చేస్తున్నారు.

అంతేకాకుండా ఇండియన్‌2 సినిమా కోసం కలరియపట్టు అనే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన కాజల్.. ‘‘కలరియపట్టు’ అనేది కేరళ యుద్ధ కళ. కుంగ్‌ ఫు, కరాటే, తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌కు ఇదే మాతృక. దీనిని ప్రాక్టీస్ చేయడంతో మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌ అవుతాం. మూడు సంవత్సరాలుగా ‘కలరియపట్టు’ను సాధన చేస్తున్నాను’ అని చెప్పారు కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ పోస్ట్‌కు #Indian2 అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

Read More : టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ట్రైలర్‌‌పై రియాక్టైన కాజల్‌ అగర్వాల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!