ఆర్మాక్స్‌ టాలీవుడ్‌ సెలబ్రిటీ లిస్ట్‌..వరుసగా నాలుగోసారి ఫస్ట్‌ ప్లేస్‌లో ప్రభాస్‌ (Prabhas)

Updated on Nov 16, 2022 06:18 PM IST
ఈశ్వర్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు
ఈశ్వర్ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్‌ (Prabhas). ఈ సినిమాతో రెబల్ స్టార్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర బోల్తా పడ్డాయి. రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులు రావడంతో ప్రభాస్‌ కాస్త నిరాశచెందారు.

ప్రస్తుతం ప్రభాస్ ఆశలన్నీ ‘ఆదిపురుష్‌’ సినిమాపైనే పెట్టుకున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమాను ముందుగా 2023 సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో వీఎఫ్‌ఎక్స్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు మేకర్స్‌. దాంతో ఈ చిత్రాన్ని సమ్మర్‌కు పోస్ట్‌ పోన్‌ చేశారు.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ సెల‌బ్రిటీల జాబితాను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే అక్టోబర్‌ నెల‌కు సంబంధించిన మోస్ట్ పాపుల‌ర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్‌ స‌ర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.

ప్రభాస్ త‌ర్వాతి స్థానంలో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌బాబు ఉన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెల‌ల్లో కూడా ప్రభాస్‌ (Prabhas) టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇక హీరోయిన్‌ల‌లో స‌మంత (Samantha) మొద‌టి స్థానంలో ఉండ‌గా కాజ‌ల్ రెండ‌వ స్థానంలో ఉన్నారు.

Read More : ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా రిలీజ్ వాయిదా! కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!