Tollywood Heroes : సినిమాలపై ఆసక్తితో సొంత బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా మారిన టాప్‌8 టాలీవుడ్ స్టార్ హీరోలు

Updated on Dec 06, 2022 08:06 PM IST
తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు
తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

ఇండస్ట్రీలో హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్‌‌ హీరోలకు ఉండే క్రేజ్‌పైనే సినిమాల ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. సినిమా హిట్ అయితే వసూళ్లు మరింతగా పెరుగుతాయి. హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ కాకుండా కొంతమంది సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా కూడా తీసుకుంటూ ఉంటారని టాక్ ఉంది. ఆ సంగతి అటుంచితే.. కొంత మంది హీరోలు నటనతోపాటు దర్శకత్వం వహించి సినిమాలపై తమకున్న ఆసక్తిని బయటపెడుతుంటారు. ఈ తరం హీరోల్లో చాలామంది దర్శకత్వం వైపు దృష్టి పెట్టిన దాఖలాలు కాస్త తక్కువనే చెప్పుకోవాలి.

పాత తరం హీరోలైన నందమూరి తారకరామారావు, కృష్ణ వంటి సీనియర్ హీరోలు మెగా ఫోన్ పట్టుకుని అభిమానులను అలరించారు. ఇక, ఇప్పటితరం హీరోల్లో చాలా మంది సొంత బ్యానర్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. సొంత బ్యానర్లు స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న టాప్‌8 టాలీవుడ్‌ (Tollywood) స్టార్ హీరోలపై ప్రత్యేక కథనం పింక్ విల్లా ఫాలోవర్స్‌ కోసం ప్రత్యేకం..

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) :

హీరోగా, రాజకీయ నాయకుడిగా పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan)కు ఎంత  ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తన టాలెంట్‌తో కోట్లాది మందిని అలరిస్తున్నారు పవన్. పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తే కాసుల వర్షం కురుస్తుందనే నమ్మకంతో ఆయన డేట్స్‌ కోసం ఎదురుచూస్తుంటారు బడా నిర్మాతలు.

పవన్‌కల్యాణ్‌ తన పేరుతో ఒక బ్యానర్‌‌ను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ అనే బ్యానర్‌‌ను పెట్టారు. ఈ బ్యానర్‌‌పై సర్దార్ గబ్బర్‌‌సింగ్, చల్‌ మోహన రంగ సినిమాలు నిర్మించారు. అవి రెండూ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. వీటి తర్వాత ఈ బ్యానర్ల నుంచి ఎటువంటి సినిమాలు నిర్మిస్తున్నట్టు ప్రకటన రాలేదు.

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

రాంచరణ్‌ (RamCharan) :

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ హీరో ఇమేజ్ గురించి తెలియని వారుండరు. చిరుతతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో పాన్‌ వరల్డ్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తన నటన, స్టైల్‌తో యూత్‌కు బాగా దగ్గరయ్యారు చరణ్.

తన ఇంటిపేరుతో బ్యానర్‌‌ను స్థాపించారు రాంచరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై చిరంజీవి రీఎంట్రీ మూవీ అయిన ఖైదీ నంబర్‌‌ 150 సినిమాను తెరకెక్కించారు. అనంతరం సైరా నరసింహారెడి, ఆచార్య సినిమాలను కూడా నిర్మించారు రాంచరణ్ (RamCharan).

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

మహేష్‌బాబు (MaheshBabu) :

నటశేఖర కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరో మహేష్‌బాబు. తన అందం, నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారు. సూపర్‌‌హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

మహేష్‌బాబు కూడా జీఎంబీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ పేరుతో బ్యానర్‌‌ను ఏర్పాటు చేశారు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు సినిమాను నిర్మించారు. అనంతరం మేజర్, సర్కారు వారి పాట, బ్రహ్మోత్సవంతోపాటు  పలు సినిమాలను ఈ బ్యానర్‌‌లో నిర్మించారు మహేష్‌బాబు (MaheshBabu).

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

నాని (Nani) :

అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో నాని. సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ నేచురల్‌స్టార్ గా ఎదిగారు. పలు సూపర్‌‌హిట్‌ సినిమాల్లో నటించిన నాని.. హీరో కాకముందు కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పనిచేశారు.

నాని (Nani) కూడా కొత్త బ్యానర్‌‌ను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు. ‘వాల్‌పోస్టర్ సినిమా’ పేరుతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ‘అ!’ అనే డిఫరెంట్ మూవీని తీసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విశ్వక్‌సేన్ హీరోగా హిట్‌ సినిమాను తెరకెక్కించారు. దానికి సీక్వెల్‌గా హిట్‌2 కూడా ఇటీవలే రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) :

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ  పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారారు రౌడీబాయ్ విజయ్ దేవరకొండ. గీతగోవిందం, అర్జున్‌రెడ్డి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

విజయ్‌ కొత్తగా బ్యానర్‌‌ పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్’ అనే పేరుతో బ్యానర్‌‌ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌‌లో ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతగా విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు మంచి లాభాలను తెచ్చిపెట్టిందని టాక్.

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

నందమూరి కల్యాణ్‌రామ్ (KalyanRam) :

‘తొలిచూపులోనే’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నందమూరి కల్యాణ్‌ రామ్. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల బింబిసార సినిమాతో సూపర్‌‌హిట్‌ అందుకున్నారు కల్యాణ్‌రామ్.

‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌’ పేరుతో బ్యానర్ స్థాపించి సినిమాలు తెరకెక్కిస్తున్నారు కల్యాణ్‌రామ్ (KalyanRam). జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవకుశ, ఓం 3డి, కిక్‌2తోపాటు పలు సినిమాలను ఈ బ్యానర్‌‌పై నిర్మించారు.

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

శర్వానంద్ (Sharwanand) :

యంగ్‌ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయిదో తారీఖు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శర్వా.. గమ్యం, ప్రస్థానం, శతమానం భవతి, రన్‌రాజారన్, శ్రీకారం, ఒకేఒకజీవితం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు శర్వానంద్.

శర్వానంద్‌ (Sharwanand) కూడా సొంతంగా బ్యానర్ పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. శర్వా ఆర్ట్స్‌ పేరుతో బ్యానర్‌‌ను స్థాపించారు. ఆయన హీరోగా నటించిన కో అంటే కోటి సినిమాను నిర్మించారు.

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

బాలకృష్ణ (BalaKrishna) :

దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ టాక్‌ షోతో ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించారు.

చాలా కాలంగా హీరోగా అలరిస్తున్న బాలకృష్ణ.. ఎన్‌బీకే ఫిలింస్‌ అనే బ్యానర్‌‌ స్థాపించి సినిమాలు నిర్మించారు. ఎన్టీఆర్‌‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను నిర్మించారు బాలకృష్ణ (BalaKrishna).

తమ నటనతో స్టార్ హీరోలుగా ఎదిగి.. బ్యానర్‌‌ పెట్టి నిర్మాతలుగా కూడా తమ సత్తా చాటుతున్న టాలీవుడ్‌ (Tollywood) స్టార్లు

దగ్గుబాటి రానా (Rana Daggubati) :

హీరోగా, విలన్‌గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు దగ్గుబాటి రానా. క్యారెక్టర్ నచ్చితే ఆ పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు రానా. బాహుబలి సినిమాలో బల్లాలదేవుడి క్యారెక్టర్ అందుకు ఉదాహరణ. తాత రామానాయుడు, తండ్రి సురేష్‌బాబు నిర్మాణ రంగంలో ఉన్నవారే.

ఇక, నటనతోపాటు ఇండస్ట్రీలోని చాలా క్రాఫ్ట్స్‌పై ఆసక్తి ఉన్న రానా.. నిర్మాతగా వేరే బ్యానర్ల భాగస్వామ్యంలో సినిమాలు చేశారు. 'బొమ్మలాట’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు రానా (Rana Daggubati).

Read More : Tollywood : థియేటర్లలో ఎక్కువ రోజులు సందడి చేసిన టాలీవుడ్‌ టాప్‌10 సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!