‘వీరసింహారెడ్డి’ (Veerasimha reddy) నుంచి క్రేజీ అప్డేట్.. ‘రాజసం ఆయన ఇంటిపేరు’ అంటూ రాబోతున్న బాలకృష్ణ..!

Updated on Nov 23, 2022 07:18 PM IST
‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 25న ఉదయం 10.29నిమిషాలకు విడుదల చేయనున్నారు.
‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 25న ఉదయం 10.29నిమిషాలకు విడుదల చేయనున్నారు.

‘అఖండ’ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఎన్‌బీకే107' వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. 

పవర్‌‌ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాస్ టైటిల్‌ను పెట్టారు. ‘వీరసింహారెడ్డి’ (Veerasimha reddy) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు అప్పట్లో ప్రకటించారు మేకర్స్. సినిమా టైటిల్‌ను కర్నూల్ కొండా రెడ్డి బురుజు వద్ద శుక్రవారం రాత్రి 8:15 నిమిషాలకు రివీల్ చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద.. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య ఈ టైటిల్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. కాగా, అంతకుముందే ఈ సినిమా టైటిల్ లీకైంది.

శ్రుతీ హాసన్ (Shruti Hassan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పాటను ఈ నెల 25న ఉదయం 10.29నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య మాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.

Read More: Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ స్పెషల్.. ఈ 3 చారిత్రక ప్రాంతాలలోనే హంగామా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!