Dil Raju: ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను.. తమిళ హీరోల వివాదంపై స్పందించిన నిర్మాత దిల్ రాజు 

Updated on Dec 17, 2022 11:26 AM IST
వివాదాలు అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. సినిమాలు తీయడం పైనే తన దృష్టి ఎప్పుడూ ఉంటుందన్నారు
వివాదాలు అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. సినిమాలు తీయడం పైనే తన దృష్టి ఎప్పుడూ ఉంటుందన్నారు

తమిళ కథానాయకులు విజయ్ (Thalapathy Vijay), అజిత్ (Ajith Kumar) మీద దిల్ రాజు (Dil Raju) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై దిల్ రాజు స్పందించారు. తాను ఎవరినీ ఎక్కువ లేదా తక్కువ చేసి మాట్లాడనని ఆయన చెప్పారు. వివాదాల్లోకి వెళ్లడం అంటే తనకు ఇష్టం ఉండదన్నారు. మంచి చిత్రం తీయడం మీదే తన దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయలు పెట్టి తీసిన ‘అవతార్ 2’ మూవీ పైరసీ కావడం బాధాకరమని, అలాంటి విజువల్ వండర్ మూవీని థియేటర్లలో చూస్తేనే సంతోషం అన్నారు. 

ఇకపోతే, దిల్ రాజు నుంచి ఓ సినిమా వస్తోందంటే చాలు సాధారణ ప్రేక్షకులతోపాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. బలమైన కథ, కథనాలు ఉంటే తప్ప ఓ పట్టాన ఆయన స్టోరీకి ఓకే చెప్పరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సున్నితమైన అంశాలకు కుటుంబ విలువను జోడించి చెప్పే ‘బొమ్మరిల్లు’, ‘శతమానం భవతి’ లాంటి కథలు ఆయన నిర్మాణ సారథ్యంలో ఎన్నో వచ్చాయి. అయితే ఈమధ్య ఆయన పెద్ద హీరోలతోనే ఎక్కువగా సినిమాలు తీస్తూ వచ్చారు. కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించింది. అయితే ఇప్పుడు దిల్ రాజు పంథా మారుస్తున్నారు. నూతన కథలతో సినిమాలు తీసే ఉద్దేశంతో కొత్తగా ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 

కొత్తవారినే ప్రోత్సహించేందుకే..
దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో పెట్టిన ఈ కొత్త నిర్మాణ సంస్థకు దిల్ రాజుతోపాటు ఆయన తనయ హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి ప్రాజెక్టుగా కమెడియన్ వేణు దర్శకత్వంలో ‘బలగం’ (Balagam Movie) అనే సినిమాను తీస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను దిల్ రాజు అందరితో పంచుకున్నారు. కొత్త తరానికి కూడా చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. తమ కుటుంబంలోని మరో తరం ఇండస్ట్రీలోకి రావడంతో వారే ఈ సంస్థ బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. 

దిల్ రాజు నుంచి ఓ సినిమా వస్తోందంటే చాలు సాధారణ ప్రేక్షకులతోపాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

‘మంచి కథలు, ప్రయోగాలతో వచ్చే కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ ఈ నూతన సంస్థ ప్రయాణం సాగుతుంది. వేణు మంచి స్టోరీ చెప్పాడు. బంధు బలగం చుట్టూ సాగే కథ ఇది. సిరిసిల్ల పక్కన ఓ ఊరు నేపథ్యంలో సాగుతుంది. సినిమా ఇప్పటికే పూర్తయింది. ఇది ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది, భావోద్వేగంతో కంటతడి పెట్టిస్తుంది’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన ఐదేళ్ల కల అని వేణు అన్నారు. పోస్టర్ పై దర్శకుడిగా పేరు చూసుకోవడంతో కల నిజమైనట్లుగా ఉందన్నారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథలాగే ఉంటుందని వేణు తెలిపారు. 

కుటుంబమే నిజమైన సంపద అని నమ్మే వ్యక్తి దిల్ రాజు అని ప్రియదర్శి అన్నారు. ‘బలగం’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆయన మాట్లాడుతూ.. ‘దిల్ రాజు తీసిన సినిమాల్లో కుటుంబ కథలు చాలా ఉన్నాయి. ఈ మూవీని కూడా అంతే గొప్పగా తీశారు’ అని చెప్పారు. కొత్త రచయితలు, దర్శకులకు తాము అందుబాటులో ఉంటూ నిర్మాణం చేపడతామని హన్షిత అన్నారు. కార్యక్రమంలో మూవీ యూనిట్ కావ్య, రచ్చ రవితోపాటు సంగీత దర్శకుడు భీమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more: చిరంజీవి నుంచి సాయికుమార్ వరకు.. విలన్‌లుగా వచ్చి హీరోలుగా మారిన టాలీవుడ్‌ స్టార్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!