Tollywood : పాట పాడి అలరించిన స్టార్ హీరోలు (తమలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించుకున్న టాప్‌10 స్టార్లు)

Updated on Dec 04, 2022 05:58 PM IST
నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు
నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

అభినయంతో ప్రేక్షకులను మెప్పించే వాళ్లు నటీనటులుగా ఎదుగుతారు. గాత్రంతో శ్రోతలను అలరించే వాళ్లు గాయకులుగా మదిని తాకే పాటలతో ఆకట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు నటీనటులే గొంతు సవరించుకుని గాయకులుగా మారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇస్తుంటారు.

తాము నటించిన సినిమాల్లోనే కాకుండా వేరే సినిమాల్లో కూడా పాటలు పాడి ఆకట్టకున్నారు పలువురు హీరోలు. స్వయంగా సాహిత్యం సమకూర్చి, పాటలు పాడి ఆకట్టుకుంటున్నారు మరికొందరు. నటనలోనే కాదు గాయకులుగానూ తామేం తక్కువ కాదంటూ ఫ్యాన్స్‌ను అలరించిన టాలీవుడ్‌ (Tollywood) టాప్‌10 హీరోల సంగతులు పింక్‌విల్లా ఫాలోవర్స్‌ కోసం ప్రత్యేకం..

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

చిరంజీవి (Chiranjeevi) :

మెగాస్టార్ చిరంజీవి ఆయన ఏం చేసినా అభిమానులు ఖుషీ అవుతారు. నటన, డాన్స్, ఫైట్స్, కామెడీ, ఎమోషన్ ఏది చేయాలన్నా ఆయనకు ఆయనే సాటి అనేంతగా మారారు చిరు. ఎంతో కష్టపడి మెగాస్టార్‌‌గా ఎదిగిన చిరంజీవి.. తనలోని మరో టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసి వారిని అలరించారు.

అదే సింగింగ్. మాస్టర్‌‌ సినిమాలో తమ్ముడు అరె తమ్ముడు’ అంటూ, మృగరాజు సినిమాలో ‘చాయ్ చటుక్కున తాగరా భాయ్’ అంటూ అభిమానులను తన పాటతో స్టెప్స్‌ వేయించారు మెగాస్టార్ (Chiranjeevi).

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

నందమూరి బాల‌కృష్ణ (BalaKrishna) :

నటసింహ నందమూరి బాలకృష్ణ తన డైలాగ్ డిక్షన్, నటనతో దాదాపు 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్‌తో టీవీల్లో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు బాలయ్.

వీటితోపాటు ఆయనలోని మరో టాలెంట్‌ కూడా ఉంది మన బాలయ్యకు. ఒకసారి స్టేజీపై పాట పాడి తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారాయన. దానికి ఫిదా అయిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌.. పైసా వసూల్ సినిమాలో ‘మామా ఏక్ పెగ్‌ లా’ పాటను బాలకృష్ణ (BalaKrishna)తో పాడించారు. ఆ పాట మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ పార్టీల్లో యూత్‌ ఈ పాటతో ఎంజాయ్ చేస్తుంటారు. 

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

వెంకటేష్ (Venkatesh) :

30 సంవత్సరాలకుపైగా సినీ కెరీర్‌‌లో ఎక్కువ సంఖ్యలో హిట్‌ సినిమాల్లో నటించి ‘విక్టరీ’ని తన టైటిల్‌గా చేసుకున్న హీరో వెంకటేష్. లవ్, యాక్షన్, డ్రామా, కామెడీ ఏ తరహా సినిమాలోనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగల టాలెంట్ ఆయన సొంతం.

కొన్నాళ్ల క్రితం విడుదలైన ‘గురు’ సినిమాలో ఒక పాట పాడారు వెంకటేష్ (Venkatesh). ‘జింగిడి జింగిడి’ అంటూ సాగే ఆ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

నాగార్జున (Nagarjuna) :

టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున తన స్టైల్, నటనతో కోట్ల మంది అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన నాగ్.. పలు సినిమాలను నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన నిర్మించిన సినిమాలు కొన్ని పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నాయి.

సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్‌ హీరోగా వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాలో పాట పాడారు నాగ్. తనలో కూడా ఒక సింగర్ దాగి ఉన్నారని నిరూపించుకున్నారు. ‘కొత్త కొత్త భాష’ అంటూ తనలోని కొత్త టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు కింగ్ నాగార్జున(Nagarjuna).

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

పవన్ కల్యాణ్ (PawanKalyan) :

పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగానే కాదు రాజకీయంగా కూడా యాక్టివ్‌గా ఉన్నారు. తన టాలెంట్‌తో సినీ ప్రేమికుల అభిమానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేనను స్థాపించారు.

తన స్టైల్‌, నటన, ఫైట్స్, డాన్స్‌లతోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న పవన్.. అప్పుడప్పుడు  సినిమాల్లో స్టంట్స్ చేస్తుంటారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు పవర్‌‌స్టార్. ఇక, తనలోని సింగింగ్ టాలెంట్‌తోనూ అలరించారాయన. జానీ, పంజా, అత్తారింటికి దారేది సహా పలు సినిమాల్లో పాటలు పాడారు పవన్ కల్యాణ్(PawanKalyan).

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) :

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. రెండో సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తారక్.. మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఇటీవల ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు తారక్.

ఇక, టాలీవుడ్‌లో ఎక్కువ పాటలు పాడిన హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) అనే చెప్పాలి. కంత్రి సినిమాలో టైటిల్ సాంగ్, ‘యమదొంగ’లో ఓలమ్మో, రభసలో రాకాసి రాకాసి, నాన్నకు ప్రేమతో’లో ఫాలో ఫాలో, అదుర్స్ సినిమాలో చారి పాటలు పాడారు. ఈ పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి.

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

రవితేజ (RaviTeja):

చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎదిగారు రవితేజ. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు మాస్‌మహారాజా. తన యాక్టింగ్‌, డైలాగ్స్‌తో మాస్‌ ప్రేక్షకులతో విజిల్స్ వేయించే రవితేజ.. టాలెంట్, హార్డ్‌వర్క్‌తో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

రెజీనా కసాండ్రా, హన్సికా మోత్వాని హీరోయిన్లుగా నటించిన పవర్ సినిమాలో పాట పాడారు రవితేజ (RaviTeja) ‘నోటంకి నోటంకి’ పాట పాడి అభిమానులను అలరించారు.

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

నితిన్ (Nithiin) :

జయం సినిమాతో ప్రారంభమైన జైత్రయాత్రను కొనసాగిస్తూ స్టార్‌‌గా ఎదిగారు యంగ్ హీరో నితిన్. యూత్‌కు కావాల్సిన ఎలిమెంట్స్‌తో సినిమాలు చేస్తూ హిట్‌లు అందుకున్నారు. యూత్‌తోపాటు ఫ్యామిలీకి చేరువయ్యే సినిమాలు చేసిన నితిన్..ఇటీవల చేసిన మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక, నితిన్‌ (Nithiin) కూడా తన సినిమాలో పాట పాడి సింగింగ్‌పై తనకు గల ఆసక్తిని బయటపెట్టారు. ఇష్క్ సినిమాలో ‘కోడివాయె లచ్చమ్మది’ అనే హిట్ సాంగ్‌ను ఆలపించారు.

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) :

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న విజయ్.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారారు. అర్జున్‌రెడ్డి సినిమా విజయ్ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది.

ఇక, రష్మికా మందాన హీరోయిన్‌గా నటించిన గీత గోవిందం సినిమాలో పాట పాడారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ‘అమెరిక గర్ల్ అయినా’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది.

నటనతోనే కాకుండా పాటలు కూడా పాడి అభిమానులను అలరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు

మంచు మనోజ్ (Manchu Manoj) :

మంచు మనోజ్ తన టాలెంట్‌తో విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా టైటిల్స్, నటన, డాన్స్ అన్నింటిలోనూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు చూపించాలని తపిస్తుంటారు మనోజ్. అందుకోసం యాక్షన్ సీన్లలో స్వయంగా రిస్కీ షాట్స్ కూడా చేస్తుంటారు.

ఇక, తనలోనూ మంచి సింగర్‌‌ ఉన్నారని నిరూపించుకున్నారు మనోజ్. లవ్, రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన పోటుగాడు సినిమాలో పాట పాడారు. ప్యార్ మే పడిపోయానే అంటూ యూత్‌ను అలరించారు మనోజ్ (Manchu Manoj).

Read More : స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించిన టాప్‌5 హీరోయిన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!